తన కొడుకును చూస్తుంటే చాలా గర్వంగా ఉందని.. ఓ కొత్త మార్గాన్ని ఎంచుకొని దాని కోసం ఎంతగానో కష్టపడుతున్నాడంటూ ఆమె ఆ ఫోటో కి క్యాప్షన్ గా పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. తన కొడుకును చూసి గర్వపడుతున్నారు. తన కొడుకు తొలి ఫోటో ఎగ్జిబిషన్ కి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేశారు. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలకు రియాన్ రాజీవ్ వాద్రా అనే కుమారుడు ఉన్నాడు. కాగా.. 20 ఏళ్ల రియాన్ ఆదివారం ఢిల్లీలో.. సొంతంగా.. తొలిసారి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. తన సోలో ఎగ్జిబిషన్ కావడం గమనార్హం. కాగా.. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన ఆమె.. ఆనందంతో మురిసిపోయారు.
తన కొడుకును చూస్తుంటే చాలా గర్వంగా ఉందని.. ఓ కొత్త మార్గాన్ని ఎంచుకొని దాని కోసం ఎంతగానో కష్టపడుతున్నాడంటూ ఆమె ఆ ఫోటో కి క్యాప్షన్ గా పేర్కొన్నారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ జులై 17వ తేదీ వరకు జరగనుంది. మొత్తం ప్రియాంక మూడు ఫోటోలు షేర్ చేయగా.. దానిలో రెండు ఆ ఎగ్జిబిషన్ ఓపెన్ సమయంలో కొడుకుతో కలిసి దిగినవి కాగా... మూడోది ఆ ఎగ్జిబిషన్ కి సంబంధించిన బ్యానర్.
కాగా.. ఈ ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రియాన్ వాద్రాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా రియాన్ కి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. రకరకాల ఫోటోలను తీస్తూ ఉంటాడు. అతనికి వ్యక్తిగతంగా ఇన్ స్టాగ్రామ్ లో 12వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
