కోవిడ్ 19 సేకండ్ వేవ్ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన ఈ సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాయకత్వ, పాలనా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని, ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. 

ఈ క్లిష్ట సమయంలో తోటి వారికి సాయపడుతూ, తోడుగా నిలవాలని ప్రజలకు విజ్జప్తి చేశారు. మంగళవారం ఆమె ‘మనం అధిగమించగలం’ అనే హెడ్డింగ్ తో ఫేస్ బుక్ లో భావేద్వేగబరిత పోస్ట్ చేశారు. 

చాలా భారమైన హృదయంతో ఇది రాయాల్సి వస్తోంది. మీలో చాలామంది కొద్ది రోజుల్లోనే తమ ఆత్మీయులను కోల్పోయారని నాకు తెలుసు. చాలా మంది కుటుంబసభ్యులు కోవిడ్‌తో పోరాడుతున్నారు. మరికొందరు కోవిడ్ భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. 

మహారాష్ట్రలోని మరో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: నలుగురు రోగులు సజీవదహనం...

కొందరు కోవిడ్‌ భయంతో ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ మహమ్మారితో ప్రభావితం కానీ వారెవరూ లేరు. దేశవ్యాప్తంగా ప్రజలు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడతున్నారు. వైద్యసాయం కోసం, టీకా సెకండ్ డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘నిరాశ నిండిన ఈ సమయంలో బలాన్ని కూడదీసుకుందాం. ఇతరులకు చేతనైనంత మేర సాయం చేద్దాం. అలుపెరగక, అన్ని ఇబ్బందుల్నీ దాటుకుంటూ సంకల్సంతో సాగడం ద్వారా మనం అధిగమించగలం’ అని చెప్పుకొచ్చారు. 

‘ఈ ప్రభుత్వం మనల్ని గాలికొదిలేసింది. ఇంతటి విధ్వంసకర సమయంలో ప్రభుత్వం నాయకత్వ, అధికార బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకోవడం ఎవరూ ఊహించలేనిది. అయినా ప్రజలు నిరాశ చెందకూడదు. ప్రతి కష్ట కాలంలోనూ సాధారణ ప్రజలు నాలాంటి, మీలాంటి వారు ముందుకు వస్తారు. మానవత్వం ఎన్నటికీ ఓడిపోదు’ అని ధైర్యం చెప్పారు.