కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత, పార్టీ అగ్రనేత  రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా ఎప్పుడు పాల్గొంటారనే చర్చసాగుతోంది. ఆమె నవంబర్ 23 నుంచి 25 తేదీ మధ్యలో రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ పాదయాత్రలో కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ సంబంధిత వ్యవహారాల ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ ప్రియాంక పాల్గొనడం ఇదే తొలిసారి. 'భారత్ జోడో యాత్ర' నవంబర్ 20న మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత, పార్టీ అగ్రనేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగుస్తుంది. మొత్తం 3,570 కి.మీ సుధీర్ఘ యాత్రలో ఇప్పటికే సగం యాత్ర పూర్తయింది. ప్రస్తుతం భారత్ జోడోయాత్ర మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోకి అడుగుపెట్టనున్నది. ఈనెల 7న మహారాష్ట్రలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ నాందేడ్ నుండి హింగోలి, వాషీమ్ జిల్లాల మీదుగా పాద యాత్ర చేశారు. నేడు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్ పూర్‌లోకి ప్రవేశించనున్నారు.


అయితే.. ఈ యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంపై పార్టీ వర్గాలు కీలక సమాచారాన్ని అందించాయి. ప్రియాంక గాంధీ వచ్చే వారం మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో యాత్ర'లో చేరనున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్రలో ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ వాద్రా చేరడం ఇదే తొలిసారి. ప్రియాంక గాంధీ తన సోదరుడితో కలిసి నవంబర్ 23 నుంచి 25 వరకు యాత్రలో పాల్గొంటారని, జీవనం, జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక సమస్యలపై ప్రజాభిప్రాయాన్ని రూపొందించేందుకు పాదయాత్ర చేయబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ తరపున ప్రచారంలో బిజీగా ఉన్నందున ఆమె ముందుగా యాత్రలో చేరలేకపోయారని తెలిపాయి. 

రాహుల్‌ గాంధీకి బాంబు బెదిరింపు 
.
నవంబర్ 20న మధ్యప్రదేశ్‌లో యాత్ర ప్రవేశిస్తుంది.నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు ఈ యాత్ర మధ్య ప్రదేశ్ లో సాగుతుంది. ఈ క్రమంలో ఉజ్జయినిలో బల నిరూపణ నిర్వహించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. భారీ ఎత్తున్న ప్రజలను కలవడం, భారీ బహిరంగ సభలను పెట్టాలని నిర్ణయించింది. అలాగే.. రాహుల్ గాంధీ నవంబర్ 28, 29 తేదీల్లో ఇండోర్‌లో విలేకరుల సమావేశంలో కూడా ప్రసంగించవచ్చు. మధ్యప్రదేశ్ నుంచి ఈ యాత్ర డిసెంబరు 5న రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. వచ్చే ఏడాది జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించే మాల్వా బెల్ట్ మీదుగా ఈ యాత్ర సాగుతుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ కు 22 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ జోడో యాత్ర ఉపకరిస్తుందని ఆ రాష్ట్ర అగ్రనేతలు భావిస్తున్నారు.వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో 15 రోజుల పాటు సాగనున్నది.