లక్నో: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక గాంధీ గంగానదిలో బోటు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

సోమవారం నాడు ప్రయగరాజ్ వద్ద గంగానదిలో బోటు యాత్రను ప్రియాంక గాంధీ ప్రారంభించారు.  మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతోంది.  ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ప్రియాంక గాంధీ బోటు యాత్ర ముగియనుంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతానికి ప్రియాంక గాంధీ ఇంచార్జీగా కొనసాగుతున్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె  140 కిలోమీటర్ల యాత్రను ఆమె ప్రారంభించారు. పవిత్ర గంగానదిలో సాగుతున్న బోటు యాత్రలో భాగంగా ఆమె నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలతో వారిని పలకరిస్తూ బోటుపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన ఆవశ్యకతను ప్రియాంకను వివరించనున్నారు. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల ప్రజలతో ప్రియాంక కలవనున్నారు.తూర్పు యూపీలో ఈ రెండు సామాజికవర్గాలు గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉండే అవకాశం ఉంది.