కాంగ్రెస్ నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి తన సోదరి ప్రియాంక గాంధీ మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు. ప్రియాంక తన సోదరుడికి రక్షణ కవచంగా మారింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు వేయడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ విషయం చర్చనీయంగా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి తన సోదరి ప్రియాంక గాంధీ మద్దతుగా నిలిచారు. ఇంతకు ముందు కూడా రాహుల్‌పై విపక్షాల నుంచి దాడి జరిగినప్పుడల్లా ప్రియాంక ధీటుగా ఎదురుదాడి చేసింది. ఈసారి కూడా ప్రియాంక తన సోదరుడికి రక్షణ కవచంగా మారింది. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు నేపథ్యంలో ప్రియాంకగాంధీ ట్వీట్ల వర్షాన్ని కుమ్మరించింది.
ట్విట్టర్ వేదికగా.. ప్రధాని మోడీ, బీజేపీపై విమర్శాస్త్రాలను సంధించింది. అమరవీరుడు, మాజీ ప్రధాని కుమారుడు రాహుల్ గాంధీని మీర్ జాఫర్ దేశద్రోహి అని ప్రధాని మోడీజీ దోపిడిదారులు అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, మరో బీజేపీ సీఎం.. రాహుల్ గాంధీని కించపరుస్తూ.. రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అని ప్రశ్నించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రియాంక పలు ట్వీట్లు చేసింది.
కాశ్మీరీ పండిట్ల ఆచారాన్ని అనుసరించి, ఒక కొడుకు తన తండ్రి మరణానంతరం కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తలపాగా ధరిస్తాడని ఆమె రాశాడు. మొత్తం కుటుంబాన్ని, కాశ్మీరీ పండిట్ సమాజాన్ని అవమానిస్తూ.. పార్లమెంటులో నెహ్రూ పేరును ఎందుకు ఉపయోగించరని మీరు అడిగారు. ఆ సమయంలో ఏ న్యాయమూర్తులు మీకు రెండేళ్ల శిక్ష విధించలేదు. మిమ్మల్ని పార్లమెంటుకు అనర్హులుగా ప్రకటించలేదు. నిజమైన దేశభక్తుడిలా రాహుల్.. అదానీ దోపిడీని ప్రశ్నించారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
'బీజేపీ అధికార ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, మంత్రులు లేదా ప్రధాని ఎవరైనా సరే.. వారు నా కుటుంబం, రాహుల్, ఇందిరా, మా అమ్మ, నెహ్రూలపై విమర్శలు గుప్పిస్తూ, తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఉంటారు. ఈ విషయం దేశానికి తెలుసు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రియాంక గాంధీ విలేకరులతో అన్నారు. "ఏ న్యాయమూర్తులు వారిపై రెండేళ్ల జైలు శిక్ష విధించలేదు లేదా వారిని అనర్హులుగా ప్రకటించలేదు" అని ఆమె తెలిపారు. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించిన ఒక రోజు తర్వాత ఈరోజు తెల్లవారుజామున రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హుడయ్యాడు.
"మా సోదరుడు అదానీ సమస్యను లేవనెత్తాడు. అందుకే ఇదంతా జరుగుతోంది. (పరువు నష్టం) కేసుపై స్టే వచ్చింది . అదానీ గురించి మా సోదరుడు పార్లమెంటులో ఆ ప్రసంగం చేసిన తర్వాత కేసు అకస్మాత్తుగా ఎందుకు పునరుద్ధరించబడింది" అని ఆమె అన్నారు. ఈ కుటుంబం(నెహ్రు కుటుంబం) భారతదేశ ప్రజల గొంతుకగా పలు విషయాలను ప్రశ్నించింది. తరతరాలుగా మా కుటుంబ సత్యం కోసం పోరాడుతోంది. తమ రక్తంతో ప్రజాస్వామ్య విలువను పెంచిన కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ తలవంచబోరని ప్రియాంక గాంధీ అన్నారు.
మీ స్నేహితుడు గౌతమ్ అదానీ దేశంలోని పార్లమెంటు కంటే, భారతదేశంలోని గొప్ప వ్యక్తుల కంటే పెద్దవాడయ్యాడా అని ప్రియాంక ప్రశ్నించింది. అతని దోపిడి గురించి ప్రశ్న లేవనెత్తినప్పుడు మీరు షాక్ అయ్యారు.తరతరాలుగా మా కుటుంబ సత్యం కోసం పోరాడుతోంది. తమ రక్తంతో ప్రజాస్వామ్య విలువను పెంచిన కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ తలవంచబోరని ప్రియాంక గాంధీ అన్నారు.మా రక్తానికి ఒక ప్రత్యేకత ఉందని, అది నీలాంటి పిరికి, అధికార దాహం ఉన్న నియంత ముందు తలవంచలేదని, ఎన్నటికీ తలొగ్గదని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. నీకేది కావాలో అదే చేయి. తరతరాలుగా మా కుటుంబ సత్యం కోసం పోరాడుతోంది.
