Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రతినెల రూ.2,000 ఇస్తాం: ప్రియాంక గాంధీ

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి గృహిణి (ఇంటి పెద్ద)కి నెలకు రూ.2,000 నగదు ఇస్తామని భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. 'గృహలక్ష్మి యోజన' కింద ప్రతి గృహిణి ఖాతాలోకి నేరుగా రూ. 24,000 ఇస్తామని హామీ ఇచ్చారు. 

Priyanka Gandhi Attack On BJP Ahead Of Karnataka Polls 2023
Author
First Published Jan 17, 2023, 3:36 AM IST

కర్ణాటకలోని బెంగళూరులో మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ  'నా నాయకి' అనే ర్యాలీని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ..  రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి మహిళ కుటుంబ పెద్దకు నెలకు రూ.2000 చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని నేరుగా మహిళల ఖాతాకు పంపుతామని తెలిపారు. ఇది గృహ లక్ష్మి యోజన కింద అమలు చేయబడుతుందనీ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఇది రెండో హామీ. గత వారం కూడా ప్రజాధ్వని యాత్ర ప్రారంభం సందర్భంగా అన్ని ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని పార్టీ ప్రకటించింది.

ఆకాశాన్నంటుతున్న ఎల్‌పీజీ ధరలు, రోజువారీ ఖర్చుల భారం నుంచి మహిళలకు కొంత ఉపశమనం కలిగించాలని ఈ పథకం ద్వారా కాంగ్రెస్ భావిస్తుందని, అలాగే కర్ణాటకలోని ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ప్రియంక గాంధీ అన్నారు. KPCC ప్రకారం..'గృహ లక్ష్మి' పథకం ద్వారా 1.5 కోట్ల మంది గృహిణులు ప్రయోజనం పొందుతారు. రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని ఆరోపించారు.

బీజేపీని టార్గెట్ 

ఈ ర్యాలీలో ప్రియాంక బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 40% కమీషన్ తీసుకుని బీజేపీ రాష్ట్రానికి రూ.1.5 లక్షల కోట్లు కొల్లగొట్టిందన్నారు. ఇక్కడ ప్రతిదానికీ లంచం ఇవ్వాలని ఆరోపించారు. ఇక్కడ జీవితం చాలా ఖరీదైనది, కానీ ఎవరూ ప్రభుత్వాన్ని నిందించలేదు. అందుకే ఇక్కడి ప్రభుత్వం అర్థం లేని వివాదాల్లో ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. భాజపా విధానం వల్ల కొందరికే మేలు జరుగుతుందని, ఈ కొద్ది మంది మాత్రమే సంపన్నులు అవుతున్నారని అన్నారు.

మరోవైపు..కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ - బీజేపీ ఇక్కడ మూడేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ, ఈ పార్టీ మహిళల కోసం ఒక్క కార్యక్రమం కూడా చేయలేదన్నారు. ప్రజలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ఎప్పుడైతే ప్రకటించిందో, అప్పటి నుంచి బీజేపీ తప్పుడు వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే పనిలో పడిందని విమర్శలు గుప్పించారు. 

ప్రియాంక గాంధీపై సీఎం బొమ్మై ఫైర్ 

బెంగళూరులో ప్రియాంక గాంధీ వాద్రా కార్యక్రమం 'నా నాయకి'పై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తనే నాయకుడని చెప్పుకోవాల్సిన స్థితి వచ్చందని ఏద్దేవా చేశారు. తన వెనుక ఏ మహిళ నిలబడకపోవడంతో ప్రియాంక గాంధీ స్వయంగా 'నా నాయకి'ని ప్రకటించాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. తన పిలుపును స్వీకరించేందుకు కర్ణాటక మహిళలు సిద్ధంగా లేరన్నారు.
 
బొమ్మై, 'ఆమె (ప్రియాంక) రానివ్వండి. బెంగళూరుకు చాలా మంది వస్తుంటారు. నాకు అభ్యంతరం లేదు. ఈ కార్యక్రమం సరిగ్గా జరగాలి, కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, 'నా నాయకి' ప్రోగ్రామ్ టైటిల్. 'ఈరోజు ప్రియాంక గాంధీ ఫోటో పెట్టుకుని 'నా నాయకి' అనాల్సి వస్తోంది. ప్రియాంక గాంధీ మహిళా నాయకురాలిగా ప్రకటించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.అని విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios