కోల్‌కతా: టీనేజీ బాలికపై అత్యాచారం చేసిన ప్రైవేట్ ట్యూటర్, ఆమె స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది.   ట్యూటర్ అతని స్నేహితుడు అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. ట్యూటర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చారు.

ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు చెప్పారు. ట్యూటర్ ను పోలీసులు కోర్టు అనుమతితో తమ కస్టడీకి తీసుకొన్నారు.అత్యాచారం చేయడంతో పాటు ఆ దృశ్యాలను వీడియోను తీశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. కరోనా నేపథ్యంలో విద్యకు ఆటంకం కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే  ట్యూటర్ వద్దకు ఆ బాలికను పంపారు తల్లిదండ్రులు.. ట్యూషన్ పేరుతో ట్యూటర్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనితో పాటు అతని స్నేహితుడు కూడ ఈ దారుణంలో పాలుపంచుకొన్నాడు.