ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆరు మెగా ప్రాజెక్టులను ఈ నెల 29వ తేదీన ప్రారంభించనున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆరు మెగా ప్రాజెక్టులను ఈ నెల 29వ తేదీన ప్రారంభించనున్నారు.
నమామి గంగే మిషన్ కార్యక్రమం కింద ఈ ఆరు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ప్రధాని మోడీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో మోడీ పాల్గొంటారని అధికారులు ప్రకటించారు.
హరిద్వార్ లోని జగ్జీజీత్ పూర్ లోని ప్రస్తుతమున్న 27 ఎంఎల్ డీ ప్రాజెక్టును అప్ గ్రేడ్ చేయనున్నారు. హరిద్వార్ లోని సరాయ్ ప్రాంతంలో 18 ఎంఎల్ డీ ఎస్ టీ పీ నిర్మించారు.
పీపీపీ మోడల్ లో పూర్తి చేసిన మొదటి మురుగు నీటటి ప్రాజెక్టు పూర్తైంది. 68 ఎంఎల్ డీ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తారు.రిషికేషిలోని లక్కడ్ ఘాట్ లో 26 ఎంఎల్‌డీ ఎస్ టీ పీ ప్రాజెక్టును కూడ ఆయన ప్రారంభించనున్నారు.
హరిద్వార్-రిషికేశ్ జోన్ ద్వారా గంగా నదిలోకి 80 శాతం వ్యర్థ నీరు వస్తోంది. ఈ ఎస్‌టీపీలతో గంగానదిని శుభ్రపర్చేందుకు దోహదపడనున్నాయి. చంద్రేశ్వర్ నగర్ లోని మునుకి రేటీ పట్టణంలో 7.5 ఎంఎల్‌డీ నాలుగతంస్తుల సీవరేజీ టెర్మినల్ ప్లాంట్ గా రికార్డు సృష్టించనుంది.చోప్రానీలో 5 ఎంఎల్ డీ ఎస్టీపీ ప్లాంట్ ను, బద్రీనాథ్ లో రెండు ఎస్టీపీలను ప్రధాని ప్రారంభించనున్నట్టుగా అధికారులు ప్రకటించారు.
గంగా నదికి సమీపంలోని 17 పట్టణాల నుండి కాలుష్యం నుండి కాపాడడం కోసం ప్రభుత్వం 30 ప్రాజెక్టులు చేపట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. ఇది ఒక చరిత్రగా చెబుతారు.ఈ ప్రాంత సంస్కృతి, జీవ వైవిధ్యం ప్రతిబింబించే గంగా అవలోకన్ అనే మ్యూజియాన్ని కూడ ప్రధాని ప్రారంభిస్తారు.
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రచురించి రోయింగ్ డౌన్ ది గంగా అనే పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు.
