ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ దామోదరదాస్ మోడీ హాస్పిటల్ చేరారు. భారతదేశ ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న ఆయన కిడ్నీ సమస్యతో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ్ముడు, ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రహ్లాద్ దామోదరదాస్ మోడీ అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. కిడ్నీ సమస్య కారణంగా ప్రహ్లాద్ దామోదరదాస్ మోడీ చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు.
పలు మీడియా కథనాల ప్రకారం.. ప్రహ్లాద్ భారతదేశ మొత్తం ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు. ఆయన కుటుంబ సమేతంగా కన్యాకుమారి, మధురై, రామేశ్వరం ఆలయాలను సందర్శిస్తున్నారు.
