ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ రెండో వేవ్ విరుచుకుపడుతున్న వేళలో ప్రధాని మోడీ ఈరోజు రాత్రి 8:45 గంటలకు తన సందేశాన్ని వినిపించనున్నారు.

ఇప్పటికే కరోనా నేపధ్యంలో పలు కీలక చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తుందని చెబుతున్నారు. 18 ఏళ్ల పైబడిన వారికీ  టీకా ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రధాని ఎలాంటి ప్రకటన చేస్తారోనన్న ఆసక్తి దేశప్రజల్లో నెలకొంది.