న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లు సోమవారం నాడు  ఫోన్ లో మాట్లాడుకొన్నారు.దేశంలో కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. సెకండ్ వేవ్ తో పలు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్  సోమవారం నాడు రాత్రి ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడారు. కరోనా విషయంలో భారత్ కు అమెరికా సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. గత ఏడాది అమెరికాలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో ఇండియా పెద్ద ఎత్తున సహాయం అందించిన విషయం తెలిసిందే. అమెరికాకు అవసరమైన మందులు, మందుల తయారీకి అవసరమైన ముడిసరుకును ఇండియా పెద్ద ఎత్తున ఎగుమతి చేసింది.

&

nbsp;

 

తమకు సహాయం చేసినట్టుగానే ఇండియాకు కూడ తాము సహాయం చేస్తామని సోమవారం నాడు ట్విట్టర్ లో బైడెన్ ప్రకటించారు.ఇదిలా ఉంటే  రెండు దేశాల్లో కరోనా పరిస్థితులపై మోడీతో చర్చించినట్టుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్  ప్రకటించారు.భారత్ కు సహకరిస్తామని ప్రకటించినందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను మోడీ ధన్యవాదాలు తెలిపారు.

 

ఈ ఇద్దరు నేతల సంభాషణలకు సంబంధించి మోడీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. టీకా ముడి పదార్ధాల సరఫరాతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. అంతేకాదు  ఇండియా, అమెరికా మధ్య ఆరోగ్య సంరక్షణ భాగస్వామ్యం  కరోనా వైరస్ విసురుతున్న సవాల్ ను పరిష్కరించనుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇవాళ అమెరికా అధ్యక్షుడితో చర్చలు ఫలప్రదమయ్యాయని మోడీ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. రెండు దేశాల్లో అభివృద్ది చెందుతున్న కరోనా కేసుల గురించి చర్చించినట్టుగా చెప్పారు. భారతదేశానికి అమెరికా అందిస్తున్న సహకారానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కి మోడీ ధన్యవాదాలు తెలిపారు.