కోవిడ్ వ్యాక్సిన్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పిన కవిత్వం వినిపించారు.
కోవిడ్ వ్యాక్సిన్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పిన కవిత్వం వినిపించారు.
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
భారతదేశ వ్యాప్తంగా ఇవాళ కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఉదయం గం. 10.30 కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు.
ఇప్పటికే టీకా పంపిణీకి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3006 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు ప్రతి సెంటర్లో 100 మందికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా 1075 కాల్ సెంటర్ ద్వారా కోవిడ్ – టీకా పంపిణీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
తగినన్ని డోసుల ‘కోవిషీల్డ్’, ‘కోవాగ్జిన్’ సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వైద్యులు, వైద్య సిబ్బందికి టీకా వేయబోతున్నారు.
