కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు వీలినం కావాలని సూచించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్, ప్రధాని నరేంద్ర మోడీ మతంతో రాజకీయాలు ఆడుతున్నారని ఆరోపించారు. అలాంటి రాజకీయాలు దేశానికి మంచిది కాదని ఉద్ఘాటించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రచారక్ ఈ దేశానికి ప్రధాని అని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల అభిప్రాయాలు ఒకే విధంగా ఉన్నాయని, అలాంటప్పుడు రెండు పార్టీలు ఎందుకు విలీనం కాకూడదని గెహ్లాట్ అన్నారు.
రాజస్థాన్‌లో జరిగిన అల్లర్ల కేసులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరినప్పటికీ విచారణకు ఆదేశించలేదని గెహ్లాట్ విమర్శించారు. "భవిష్యత్తులో మతపరమైన హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకు అల్లర్ల కేసులపై దర్యాప్తునకు ఆదేశించే ధైర్యం ఆయన (షా) ఎందుకు చూపడం లేదు" అని ఆయన ప్రశ్నించారు.
ఇటీవలి అల్లర్ల కేసుల్లో నిందితులందరూ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి చెందిన వారే అని, ఇటలీకి చెందిన వారు కారని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. బీజేపీపై మరింత దాడి చేసిన గెహ్లాట్.. మత హింస ఘటనల వల్ల ఏ రాజకీయ పార్టీ లబ్ధి పొందుతుందో అర్థం చేసుకోవాలని అన్నారు. అల్లర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూనే, అల్లర్లలో కాంగ్రెస్ ప్రమేయం లేదని సీఎం స్పష్టం చేశారు.
ఇటీవల, రాజస్థాన్ జోధ్‌పూర్, కరౌలీలో మతపరమైన హింసాత్మక ఘటనలు వెలుగు చూశాయి. గెహ్లాట్ స్వస్థలమైన జోధ్‌పూర్‌లో కూడా ఈద్‌కి కొన్ని గంటల ముందు హింస జరిగింది. జలోరీ గేట్ సర్కిల్‌పై ఇస్లామిక్ జెండాలు పెట్టడంపై జోదూర్‌లో హింస చెలరేగింది. రామ నవమి, జనుమాన్ జయంతి ఊరేగింపుల సందర్భంగా కరౌలి, జోధ్‌పూర్, ఇతర రాష్ట్రాల్లో వెలుగు చూసిన హింసాత్మక సంఘటనలపై విచారణకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేయాలని గెహ్లాట్ సవాలు చేసిన కేంద్ర హోంమంత్రిని కోరారు.
కాగా.. రామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో మతపరమైన హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కర్ణాటక నుండి అనేక హింస, దహన సంఘటనలు జరిగాయి. మే 5వ తేదీన బీజేపీ తన ‘హుంకార్ ర్యాలీ’ని నిర్వహించింది. ఆ ర్యాలీ రాజస్థాన్‌లోని గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మతపరమైన హింసతో పాటు అనేక సమస్యలను ఎత్తి చూపుతూ ఆరోపణలు చేసింది.
