Electoral Bond: ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్లపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
Electoral Bond: లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ప్రతిపక్ష పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.
Electoral Bond: 2024 లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ప్రతిపక్ష పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత నిజాయితీగా ఆలోచిస్తే.. ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడతారని ప్రధాని మోదీ అన్నారు.
ఎఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో నల్లధనాన్ని అరికట్టడమే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ లక్ష్యమని, అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై నిందలు వేసి పారిపోవాలనుకుంటున్నాయని అన్నారు. ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర నమోదై ఉంటాయన్నారు.
‘రాజకీయ పార్టీలకు ఎవరు విరాళాలు ఇచ్చారు ? ఏ కంపెనీ ఏ పార్టీకి ఏంత డబ్బు ఇచ్చింది? ఎలా ఇచ్చింది? ఎక్కడిది? అనే లెక్కలన్నీ పకడ్బందీ నమోదు చేసి ఉంచే విధానం తప్పుగా ఎందుకు అనిపించింది ?’’ అని ప్రధాని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల వివరాలన్నీ ప్రభుత్వానికి తెలుసుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఎలక్టోరల్ బాండ్లను సమర్థించిన ప్రధాని మోడీ ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడమే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ లక్ష్యం అని, నిజాయితీగా పరిగణిస్తే ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడతారని ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ అన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల బాండ్ల విషయంలో తమ ఆలోచన స్వచ్ఛమైందనీ, తమకు ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల బాండ్ల వ్యవస్థకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందినప్పుడు దానిపై పార్లమెంటులో చర్చ జరిగిందనీ, అప్పుడు దానిపై విశ్లేషణలు చేస్తున్న వారిలో కొందరు అప్పట్లో బిల్లును సమర్థించారని మోడీ చెప్పారు. అదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల రాడార్‌పైకి వచ్చిన వెంటనే కొన్ని కంపెనీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి ఎలా విరాళాలు ఇచ్చాయో వివరించాలని రాహుల్ గాంధీ ప్రధానికి సవాలు విసిరారు.
ప్రధానిపై రాహుల్ దాడి
అంతకు ముందు .. ఎలక్టోరల్ బాండ్ 'స్కామ్' సూత్రధారి ప్రధాని నరేంద్ర మోడీ అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకమని, దీని సూత్రధారి ప్రధాని మోదీ అని కాంగ్రెస్ నేత అన్నారు. తొలుల సీబీఐతో దర్యాప్తు ప్రారంభించి, ఆ తర్వాత వెంటనే వారికి (బీజేపీ) డబ్బులు అందేలా చూడాలని ప్రధానిని అడగాలని ఆయన అన్నారు. కాసేపటికే సీబీఐ దర్యాప్తును నిలిపివేశారు. కంపెనీ డబ్బు చెల్లిస్తుంది. ఆ తర్వాత వెంటనే వారికి కాంట్రాక్ట్ ఇవ్వబడుతుంది. ఎలక్టోరల్ బాండ్లలో పేరు, తేదీలను పరిశీలిస్తే..దాతల వివరాలు ఎలక్టోరల్ బాండ్లను వివారాలు తెలుస్తాయని అన్నారు.
ప్రధాని పై టార్గెట్
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ టార్గెట్ చేసింది. బాండ్లకు సంబంధించిన డేటా భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదిక తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. ప్రధాని అవినీతి టాప్ కు చేరిందనీ, నిజాయితీ అథపాతానికి తొక్కేశారని పోస్ట్ చేశారు. ఎలక్టోరల్ బాండ్ పథకం పూర్తిగా రహస్యంగా ఉండేలా రూపొందించారని రమేష్ ఆరోపించారు. అదేంటంటే.. రాజకీయ పార్టీల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎలా వినియోగిస్తున్నారనే వివరాలను ప్రధాని మోదీ ప్రజలకు తెలియకుండా దాచాలన్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఎలక్టోరల్ బాండ్ల రద్దు
ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2018 ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేసింది. ఇది భావప్రకటన స్వేచ్ఛ , సమాచార హక్కుకు రాజ్యాంగ హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది.