ఆంజనేయునికి పూజ చేస్తూ ఓ పూజారి ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన నమక్కల్ ఆంజనేయస్వామికి మంగళవారం కావడంతో వెంకటేశన్ అనే పూజారి స్వామివారిని అలంకరిస్తున్నారు.

ఆంజనేయునికి పూజ చేస్తూ ఓ పూజారి ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన నమక్కల్ ఆంజనేయస్వామికి మంగళవారం కావడంతో వెంకటేశన్ అనే పూజారి స్వామివారిని అలంకరిస్తున్నారు.

ఈ క్రమంలో 18 అడుగుల ఎత్తైన హనుమంతుని విగ్రహానికి పూలమాల వేస్తున్నాడు. అందుకు 11 అడుగుల ఎత్తైన స్టాండ్‌ని ఉపయోగించాడు. మాల వేసే సమయంలో ఒక్కసారిగా తూలి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన తోటి పూజారులు, ఆలయ సిబ్బంది వెంకటేశన్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. భగవంతుడికి పూజలు చేస్తూ పూజారి మృత్యువాత పడటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఆలయంలో సంప్రోక్షణ అనంతరం పూజారులు భక్తుల్ని తిరిగి దర్శనానికి అనుమతించారు.