రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో కాటరాక్ట్ సర్జరీ జరిగింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయినట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కంటి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ విజయవంతమైనట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్(రిఫరల్, రీసెర్చ్)లో కాటరక్ట్ సర్జరీ జరిగినట్టు తెలిపింది. ఆపరేషన్ సక్సెస్ అయిందని, అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయినట్టు వివరించింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
‘భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఈ రోజు(ఆగస్టు 19) ఉదయం ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో కాటరక్ట్ సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతంగా ముగిసింది. అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యారు’ అని ఆ ప్రకటన వివరించింది.
75ఏళ్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛాతిలో సమస్యతో మార్చి నెలలో ఈ హాస్పిటల్‌కు వెళ్లిన సంగత తెలిసిందే. తర్వాత కూడా పలుసార్లు రోటీన్ టెస్టుల కోసం ఈ హాస్పిటల్ సందర్శించారు.
