పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు.

ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

* స్టాట్యూ ఆఫ్ యూనిటీ ద్వారా సర్దార్ పటేల్‌కు నివాళి

* కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణంతో చరిత్ర సృష్టించాం

* స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవిస్తున్నాం

* కొత్త రక్షణ ఒప్పందాలు దేశ భద్రత కోసమే

* రాఫెల్ యుద్ధ విమానాల రాకతో మన సరిహద్దులు మరింత సురక్షితం

* విదేశాల్లో చిక్కుకుపోయిన 2 లక్షల 20 వేల మందికి పైగా భారతీయుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చాం

* ఈశాన్య భారతావని అంతటా వేగంగా అభివృద్ధి పనులు

* ఈశాన్య రాష్ట్రాల రాజధానులను కలిపేలా రైల్వే నెట్‌వర్కింగ్ విస్తరణ

* రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించాం

* ఈ ఏడాది కుంభమేళాలో ప్రపంచస్థాయి వసతులు కల్పించాం

* గంగానది ప్రక్షాళకు కృషి చేస్తున్నాం

* సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదుల పీచమణిచాం

* దేశరక్షణ విషయంలో రాజీపడటం లేదు

* మనీలాండరింగ్ చట్టాన్ని కఠినతరం చేశాం

* నోట్ల రద్దు కీలకమైన నిర్ణయం

* డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పేరుతో అందరికీ బ్యాంకింగ్ సేవలు 

* జీఎస్టీతో వ్యాపార లావాదేవీలను పారదర్శకం చేశాం

* ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్‌లో కీలక మార్పులు తెచ్చాం

* మిషన్ గగన్‌యాన్ విజయవంతమవుతుందని ఆశీస్తున్నా

* వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ది చేస్తున్నాం

* ఉడాన్ పథకంతో సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం

* చిన్న నగరాల్లో సైతం పాస్‌పోర్ట్ కేంద్రాలు ఏర్పాటు చేశాం

* దేశవ్యాప్తంగా పలు చోట్ల ఎయిమ్స్ నిర్మాణాలు

* రైతుల ఉత్పత్తులకు మంచి ధర కల్పించడం మా లక్ష్యం

* వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధరను రెట్టింపు చేశాం

* పంటలకు బీమా రక్షణ కల్పిస్తున్నాం

* వాజ్‌పేయ్ పాలన తర్వాత సంక్షేమ పథకాలు మరుగునపడ్డాయి

* ధరలను పెరుగుదలను నియంత్రించాం

* పేదలకు మేలు చేసే విధంగా పలు సంస్కరణలను తెస్తున్నాం

* దేశంలోని అన్ని కుటుంబాలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి తెచ్చాం

* జన్‌ధన్ యోజనతో ఖాతాలతో ప్రభుత్వం, పౌరుల మధ్య అడ్డుగోడలు తొలగాయి

* మహిళా సాధికారకతకు కట్టుబడి ఉన్నాం

* చారిత్రాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చాం

* ముద్రా యోజనతో రూ. 7 లక్షల కోట్ల రుణాలిచ్చాం

* న్యాయబద్ధంగా వచ్చిన వారందరికీ భారత పౌరసత్వం ఇచ్చాం

* కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లను త్వరలో ఎత్తివేస్తాం

* క్రీడల్లో భారత్ రాణిస్తోంది.. క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం

* పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలిస్తున్నాం

* దేశంలోని గ్రామ పంచాయతీలన్నింటకీ డిజిటల్ సేవలు అందిస్తున్నాం

*  అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు

* ఉజ్వల్ యోజన కింద రూ. 6 కోట్ల గ్యాస్ కనెక్షన్లు మంజూరు

* 50 జిల్లాల్లో రూ.4900 కోట్లతో ఆసుపత్రుల నిర్మాణం

* జన్‌ధన్ యోజనతో 34 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు

* నల్లధనాన్ని నిర్మూలించాం, అవినీతిని అడ్డుకున్నాం

* ప్రధాని బీమా యోజనతో 21 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు

* దివ్యాంగులకు సమాన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం

* బాలికలపై అత్యాచారాలు చేసే వాళ్లకు ఉరిశిక్ష విధించేలా చట్టం చేశాం

* స్టార్టప్ ఇండియాతో పరిశ్రమలు స్థాపించే యువతను ప్రోత్సహిస్తున్నాం

* అన్ని రంగాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు

* ముద్రా రుణాల్లో అత్యధిక శాతం మహిళలకే దక్కాయి

* సైన్యంలోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం

* గ్రామీణ ఆవాస్ యోజన కింద కోటికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం

* ప్రతి పౌరుడి జీవితంలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తున్నాం

* 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా అమలు చేస్తున్నాం

* ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నాం

*  వాజ్‌పేయి హయాంలో అనేక కొత్త కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి

* దివ్యాంగుల కోసం రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం

*  నవ భారత నిర్మాణానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది

* నిరుపేదలకు సైతం విద్యుత్, వంటగ్యాస్‌ను అందుబాటులోకి తెచ్చాం

* మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల గౌరవాన్ని పెంచాం. దేశంలో మొత్తం 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం.

* ఆయుష్మాన్ భారత్ పథకంతో నిరుపేదలకు మెరుగైన వైద్యంతో పాటు వైద్య ఖర్చులను తగ్గించాం

* అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాలను అనుసరించి పనిచేస్తున్నాం

* తల్లీ, సోదరీమణులకు ఉజ్వల్ యోజన ప్రయోజనాలు

* హృద్రోగులకు ఉపయోగించే స్టంట్ల ధరలను తగ్గించాం

* 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నాం

*  అవినీతి నుంచి భారత్‌ను విముక్తి చేయాలని చూస్తున్నాం.

* మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం

* 2019 భారతదేశానికి అత్యంత కీలకమైన సంవత్సరం

* కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలందరికీ అందుతున్నాయి