Asianet News TeluguAsianet News Telugu

రిపబ్లిక్ డే వేడుకలు: జాతీయ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని కర్తవ్యపథ్ లో జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ఇవాళ ఆవిష్కరించారు.  

President Droupadi Murmu unfurls national flag at Kartavya Path
Author
First Published Jan 26, 2023, 10:53 AM IST

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని కర్తవ్యపథ్  లో  జాతీయ పతాకాన్ని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  గురువారం నాడు ఆవిష్కరించారు.  అనంతరం సైనిక గౌరవ వందనాన్ని రాష్ట్రపతి  స్వీకరించారు.  రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసిరాగా  రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 105 మి.మి ఇండియన్ ఫీల్డ్ గన్స్ తో  21 గన్స్ సెల్యూట్ చేయడం ఇదే  ప్రథమం.   ఇది పాత కాలపు 25 పౌండర్  తుపాకీ స్థానాన్ని భర్తీ చేసింది.  అంతకుముందు  జాతీయ యుద్ధ స్మారక అమరవీరులకు  ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. 

రిపబ్లిక్ డే  వేడుకల్లో  ఈజిప్టు  అధ్యక్షుడు  అబ్దుల్ ఫత్వా ముఖ్య అతిథిగా  హజరయ్యారు.   రిపబ్లిక్ డే వేడుకల్లో  ప్రధాని నరేంద్ర మోడీ సహ పలువురు మంత్రులు, వీఐపీలు అధికారులు , ప్రముఖులు పాల్గొన్నారు. పరేడ్  కమాండర్ లెఫ్టినెంట్  ధీరజ్ సేథ్ నేతృత్వంలో  కర్తవ్య పథ్ నుండి గ్రౌండ్  పరేడ్  ప్రారంభమైంది. లెఫ్టినెంట్  ప్రజ్వల్  కలా నేతృత్వంలోని  861 మిస్సైల్  రెజిమెంట్ కు చెందిన బ్రహ్మోస్  డిటాచ్ మెంట్ కర్తవ్య వద్ద కవాతులో పాల్గొంది.
తొలిసారిగా  కర్తవ్య మార్గంలో ఈజిప్ట్  సాయుధ దళాల సంయుక్త బ్యాండ్  , కవాు బృందం  కవాతు చేస్తుంది.ఈ బృందానికి  కల్నల్ మహమూద్ అబ్దుల్ ఫట్టా  ఎల్. ఖరసాని నాయకత్వం వహిస్తున్నారు.

విజయ్ చౌక్ నుండి ఎర్రకోట వరకు  జవాన్లు కవాతు నిర్వహించారు.  ఈ పరేడ్ ను తిలకించేందుకు  45 వేల మంది హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని  నిర్వహించిన శకటాల ప్రదర్శనలో  రక్షణ శాఖ శకటాలు ఆకట్టుకున్నాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios