Asianet News TeluguAsianet News Telugu

12 సెంట్రల్ యూనివర్శిటీలకు కొత్త వీసీలు: హైదరాబాద్ వర్సిటీకి బిజె రావు


దేశంలోని 12 సెంట్రల్ యూనివర్శిటీలకు వీసీలను రాష్ట్రపతి నియమించారు.ఈ మేరకు శుక్రవారం నాడు ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా 10 యూనివర్శిటీల వీసీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

President appoints Vice Chancellors of 12 central universities lns
Author
New Delhi, First Published Jul 23, 2021, 3:32 PM IST

న్యూఢిల్లీ: దేశంలో 12 సెంట్రల్ యూనివర్శిటీలకు వీసీలను  నియమించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఈ మేరకు శుక్రవార నాడు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.దేశంలోని 22 వీసీ పోస్టుల్లో ప్రస్తుతం 12 పోస్టులను భర్తీ చేశారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేశారు.

హైద్రాబాద్ :బస్‌త్కర్ జె.రావు
హర్యానా:తనికేశ్వర్ కుమార్
హిమాచల్‌ప్రదేశ్:'సత్‌ప్రకాష్ బన్సాల్
జమ్మూ:సంజీవ్ జైన్
జార్ఖండ్:క్షిట్టి భూషన్ దాస్
కర్ణాటక:బట్టు సత్యనారాయణ
తమిళనాడు:ముత్తుకళింగన్ కృష్ణన్
బీహార్:కామేశ్వర్ నాథ్ సింగ్
నార్త్‌హిల్ యూనివర్శిటీ: ప్రభాశంకర్ శుక్లా
గురుగసిదాస్: అలోక్ కుమార్ చక్రవాల్
మౌలానా ఆజాద్ యూనివర్శిటీ:సయ్యద్ ఐనాల్ హసన్
మణిపూర్ యూనివర్శిటీ: ఎన్. లోకేందర్ సింగ్


జేఎన్‌టీయూ, డీయూతో సహా మొత్తం 10 విశ్వవిద్యాలయాలకు వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఖాళీగా ఉన్న 10 యూనివర్శిటీల వీసీ పోస్టులను కూడ భర్తీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios