సీరియస్ గా గొడవ పడుతుంటే.. ముద్దు పెట్టాడనే కోపంతో.. ఓ భార్య తన భర్త నాలుకను కొరికేసింది. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...ఔటర్ ఢిల్లీలోని రణహోలా ప్రాంతానికి చెందిన కరణ్ స్ట్రీట్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో 2016లో వివాహం జరిగింది.

తన భర్త అందంగా ఉండడంటూ.. తనకు లైంగిక జీవితం కూడా ఆనందంగా లేదని కరణ్ భార్య అస్తమానూ ఆరోపిస్తూ ఉంటుంది. ఇదే విషయంలో వారిద్దరికీ తరచూ గొడవలు జరగుతూనే ఉన్నాయి.

అయితే.. ఎప్పటిలాగా.. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన కరణ్ తో భార్య గొడవ పడింది. భార్య గొడవ ఎంతకీ ఆపకపోవడంతో.. ఆమెను కూల్ చేసేందుకు కరణ్ ఆమెకు ముద్దు పెట్టాడు. అసలే కోపంతో రగలిపోతున్న ఆమె.. సడెన్ గా ముద్దు పెట్టడంతో మరింత కోపోద్రోక్తురాలైంది. అంతే.. అదే అదనుగా చేసుకొని అతని నాలుకని కొరికేసింది.

సగానికి అతని నాలుక తెగి కిందపడింది. గమనించిన కరణ్ తండ్రి అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కరణ్ కి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయినప్పటికీ అతనికి నోటి వెంట నుంచి మాటలు రాకపోవడం గమనార్హం. కరణ్ భార్య ప్రస్తుతం ఆమె 8నెలల గర్భవతి. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.