ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ కొత్త అందాలు చూడండి...

మహా కుంభమేళా 2025 కోసం ప్రయాగరాజ్‌లోని రైల్వే స్టేషన్లను కళాత్మకంగా అలంకరించారు. రామాయణం, కృష్ణలీల, బుద్ధుడు వంటి ఇతివృత్తాలతో కూడిన చిత్రాలు భక్తులకు ప్రయాగరాజ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిచయం చేస్తున్నాయి.

Prayagraj Railway Stations Adorned with Art for Mahakumbh 2025 AKP

మహాకుంభ నగర్ : మహా కుంభమేళా 2025 ఏర్పాట్లకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గ్రాండ్ లుక్ ఇస్తోంది. ముఖ్యంగా నగరం మొత్తాన్ని అందంగా తీర్చిదిద్దారు. దీంతో ప్రయాగరాజ్ అందాలు బయటి నుంచి వచ్చే భక్తులకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ రైల్వే కూడా ప్రయాగరాజ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. "పెయింట్ మై సిటీ" కార్యక్రమంలో భాగంగా ప్రయాగరాజ్‌లోని అన్ని రైల్వే స్టేషన్లను కళా, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చారు.

ప్రయాగరాజ్ వారసత్వాన్ని చాటుతున్న గోడలు

ప్రయాగరాజ్ జంక్షన్, నైనీ జంక్షన్, ఫాఫామావ్, ప్రయాగ్ జంక్షన్, జున్సీ, రాంబాగ్, చివ్కి, ప్రయాగరాజ్ సంగం, సుబేదార్‌గంజ్ రైల్వే స్టేషన్లు మహా కుంభమేళా సందర్భంగా భారతీయ కళ, సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ఈ స్టేషన్ల గోడలపై హిందూ పురాణ గాథలు, భారతీయ సంప్రదాయాలను చిత్రించే అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. రామాయణం, కృష్ణలీల, బుద్ధుడు, శివభక్తి, గంగా హారతి, మహిళా సాధికారత వంటి ఇతివృత్తాలతో ఉన్న ఈ చిత్రాలు భక్తులకు, పర్యాటకులకు ప్రయాగరాజ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిచయం చేస్తున్నాయి.

భక్తులను ఆకర్షిస్తున్న చిత్రాలు

రైల్వే చేపట్టిన ఈ కార్యక్రమం కేవలం అలంకరణకే పరిమితం కాలేదు. ప్రయాగరాజ్ చారిత్రక, సాంస్కృతిక సంప్రదాయాలను కూడా ప్రతిబింబిస్తోంది. ఈ చిత్రాల్లో ఋషి పరంపర, గురు-శిష్య పరంపర, జ్ఞానం, త్యాగం వంటి విషయాలను చూపించారు. ఇవి ప్రయాగరాజ్ ఆధ్యాత్మిక స్వరూపాన్ని మరింత ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఈ చిత్రాలు మహా కుంభమేళా 2025కి వచ్చే లక్షలాది మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. భారతీయ రైల్వే చేపట్టిన ఈ కార్యక్రమం కళ, అభివృద్ధికి సంగమంలా ఉంది. మహా కుంభమేళా 2025కి ప్రయాగరాజ్ వచ్చే ప్రతి ఒక్కరూ ఈ గొప్ప ఉత్సవాల్లో పాల్గొనడమే కాకుండా నగర ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని అనుభూతి చెందేలా ఈ కార్యక్రమం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios