Prayagraj Mahakumbh 2025 : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 13న మహాకుంభం 2025 ఏర్పాట్లను పరిశీలిస్తారు. దీనికి ముందు ముఖ్యమంత్రి యోగి డిసెంబర్ 7న నగర అలంకరణ ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

Prayagraj Mahakumbh 2025: ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 13న "ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ 2025" ఏర్పాట్లను పరిశీలించడానికి, ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రయాగరాజ్ వస్తున్నారు. ఆయన రాకకు ముందు సీఎం యోగి డిసెంబర్ 7న అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తారు. పండుగ సమయంలో ప్రజలు తమ ఇళ్లను అలంకరించినట్లుగానే మహాకుంభ్ సందర్భంగా ప్రయాగరాజ్‌ను అలంకరించాలని ప్రణాళిక ఉంది. ఈ క్రమంలో అన్ని శాఖలు తమ కార్యాలయాలు, భవనాలను అందంగా తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు. భవనాలను లైటింగ్‌తో ప్రకాశవంతం చేయాలని కూడా ప్రణాళిక ఉంది. అదనంగా, ప్రధాన కూడళ్లను, రోడ్లను కూడా రంగురంగుల లైట్ల వెలుతురుతో అలంకరిస్తారు. అన్ని అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని మండల కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ ఆదేశించారు. అలాగే, ప్రధాని మోడీ ప్రారంభించే ప్రాజెక్టులను కూడా సమయానికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా డిసెంబర్ 7న పర్యటిస్తారు

స్వచ్ఛమైన-హరిత మహాకుంభ్ ను విజయవంతం చేయడమే లక్ష్యంగా యోగి సర్కారు ముందుకుసాగుతోంది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి మండల కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ మాట్లాడుతూ.. అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయనీ, వీటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి రాకకు ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా డిసెంబర్ 7న పర్యటిస్తారని తెలిపారు. "సీఎం ఆదేశాల మేరకు అన్ని పనులు చేపడుతున్నారు. సీఎం స్వయంగా ఈ పనులన్నింటినీ సమీక్షిస్తారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా నగరం మొత్తం స్వచ్ఛమైన-హరిత మహాకుంభ్ దృష్టిని ప్రతిబింబిస్తుందని" ఆయన అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, అన్ని శాఖలు తమ కార్యాలయాలను అందంగా తీర్చిదిద్దాలనీ, వాటిలో లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ దిశగా కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే, ప్రధాన కూడళ్లు, రోడ్లు, ఉద్యానవనాలను కూడా లైట్లతో అలంకరిస్తారు.

ప్రయాగరాజ్ తీర్థనగరినికి సరికొత్త అలంకరణ

ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు-అధికారులు పూర్తి సన్నద్ధతతో ఉన్నారని మండల కమిషనర్ తెలిపారు. పిడబ్ల్యుడి అన్ని ముఖ్యమైన రోడ్ల పునరుద్ధరణను వేగంగా పూర్తి చేస్తోంది. అన్ని కూడళ్లు-రోడ్డు అలంకరణ పనులను ప్రయాగరాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ, పిడబ్ల్యుడి సమయానికి పూర్తి చేస్తాయి. నగరపాలక సంస్థ వీధి దీపాలు-లైటింగ్ పనులు చేపడుతోంది. విద్యుత్ శాఖ అన్ని విద్యుత్ కేబుళ్లను వేగంగా వేస్తోంది. అదనంగా, సి&డిఎస్ గేట్లు, ఇన్‌స్టాలేషన్ పనులను పూర్తి చేస్తుంది. కారిడార్ల పనులకు కూడా తుది రూపం ఇస్తున్నారు. వాటిని సమయానికి పూర్తి చేస్తారు. ఘాట్‌లపై పరిశుభ్రతను కాపాడటానికి రాత్రింపగలు పని జరుగుతోందని తెలిపారు.

మహాకుంభ్ 2025 పనులపై సమీక్షా సమావేశం

డిసెంబర్ 7న సీఎం ఖోయా పాయా కేంద్రం, పబ్లిక్ వసతి గృహాన్ని ప్రారంభిస్తారు. ప్రధాని మోడీ పర్యటనకు ముందు డిసెంబర్ 7న సీఎం యోగి ప్రయాగరాజ్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఖోయా పాయా కేంద్రం-సెక్టార్-1లో ఏర్పాటు చేసిన పబ్లిక్ వసతి గృహాన్ని ప్రారంభిస్తారు. సీఎం యోగి డిసెంబర్ 7న తన పర్యటనలో సర్క్యూట్ హౌస్‌లో ప్రధాని మోడీ కార్యక్రమం గురించి సంస్థాగత అధికారులతో ముఖ్యమైన సమావేశం నిర్వహిస్తారు. ఇక్కడే ఆయన మహాకుంభ్ 2025 పనుల సమీక్షా సమావేశంలో కూడా పాల్గొంటారు. అలాగే, అలోపిబాగ్ ఫ్లైఓవర్, అలోపిబాగ్ రోడ్డును పరిశీలిస్తారు.