యోగి సర్కార్ సరికొత్త ప్రయత్నం ... ప్రయాగరాజ్ కుంభమేళాలో దేశభక్తి
యోగి సర్కార్ ప్రయాగరాజ్‌లో శహీద్ వాల్ నిర్మించింది. మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు తెలియని అమరవీరుల త్యాగాలను తెలియజేసే ప్రయత్నమే ఈ శహీద్ వాల్.
ప్రయాగరాజ్ : ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ ఒకవైపు మహా కుంభమేళా లాంటి సనాతన, ఆధ్యాత్మిక వేడుకలో దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల గుర్తుచేసుకుంటోంది. వారి త్యాగాలను, వీర గాథలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రయాగరాజ్ లో అమరవీరుల జ్ఞాపకార్థం 'శహీద్ వాల్' ను నిర్మించింది.
రూ.3.5 కోట్లతో శహీద్ వాల్ సిద్ధం :
కుంభ నగరి ప్రయాగరాజ్‌కి వచ్చే భక్తులు, పర్యాటకులు ఈసారి ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అమరవీరుల త్యాగాలను కూడా తెలుసుకుంటారు. ఇందుకోసం యోగి సర్కార్ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను గుర్తించి, వారి త్యాగ గాథను ప్రజలకు చేరవేసేందుకు శహీద్ వాల్ నిర్మించింది.
ప్రయాగరాజ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా దీన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ శహీద్ వాల్ నిర్మాణం పూర్తికాగా తుది మెరుగులు దిద్దుతున్నారు. నగరంలోని సివిల్ లైన్స్‌లోని మహాత్మా గాంధీ మార్గంలో రూ.3.5 కోట్లతో దీన్ని నిర్మించారు. మహా కుంభమేళాకు వచ్చే సందర్శకులు ఈ వాల్ ను కూడా సందర్శించనున్నారు... కాబట్టి త్వరలోనే ఈ శహీద్ వాల్ ను ప్రారంభించే అవకాశం ఉంది.
స్వాతంత్య్ర సమరయోధులకే అంకితం :
ప్రయాగరాజ్ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. నగరంలో చాలా మంది అమరవీరుల త్యాగాల గుర్తులు ఇప్పటికీ వున్నాయి. అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ వీరమరణం పొందిన ఆజాద్ పార్క్, ఠాకూర్ రోషన్ సింగ్ త్యాగానికి సాక్షిగా నిలిచిన మాలకా జైలు వీటిలో ప్రధానమైనవి. వీరితో పాటు జిల్లాలో చాలా మంది తెలియని స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. వారి త్యాగాల గురించి కొత్త తరానికి తెలియదు. ఇలాంటి స్వాతంత్య్ర సమరయోధులను వెలుగులోకి తేవడానికే యోగి సర్కార్ ఈ శహీద్ వాల్ నిర్మించింది.
నగరంలోని సివిల్ లైన్స్‌లో 108 అడుగుల పొడవైన ఈ గోడ ప్రయాగరాజ్‌కి చెందిన 29 మంది స్వాంతంత్య్ర పోరాటయోధులకు అంకితం చేసారు. ఈ వాల్ పై ఆ అమరవీరుల చిత్రపటాలను వుంచారు. వారి గురించి ఎర్ర ఇసుకరాయిపై రాసి ఉంది. దీంతో పాటు ఎనిమిది పెద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. వాటి కింద అమరవీరుల త్యాగాల గురించి రాతిపై చెక్కబడ్డాయి.
ఈ శహీద్ వాల్‌లో రెండు వాటర్ కూలర్లు, వాటర్ ఫౌంటెన్ కూడా ఉన్నాయి. అయిదు పందిళ్లు కూడా నిర్మించారు. ఎల్‌ఈడీ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. గోడ చుట్టూ పచ్చదనం, ఉద్యానవనం కూడా ఏర్పాటు చేశారు. గోడ పక్కన సైనేజ్‌లు కూడా ఏర్పాటు చేశారు. కూర్చోవడానికి ప్రత్యేక రాతితో చేసిన స్థలం కూడా ఉంది.