ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో బర్డ్ ఫెస్టివల్

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భాగంగా 2025, ఫిబ్రవరి 1,2 తేదీల్లో బర్డ్ ఫెస్టివల్ జరగతుంది. పక్షులను కాపాడటం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడానికి,  పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Prayagraj Mahakumbh 2025 to Host Bird Festival Promoting Ecotourism AKP

ప్రయాగరాజ్ : భారతీయ సంస్కృతిలో ధర్మం, ప్రకృతికి మధ్య సంబంధం విడదీయలేనిది. ప్రకృతి సంరక్షణను మన ధార్మిక సంప్రదాయాలు, విశ్వాసాలు ప్రోత్సహించేలా వుంటాయి. దీన్ని ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది.  ఈ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో బర్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.

జీవవైవిధ్య, ప్రకృతి సంరక్షణ వేదికగా కుంభమేళా

భారతీయ సంస్కృతిని ప్రకృతి సంరక్షణ సంస్కృతిగా కూడా గుర్తిస్తారు. చెట్లు, నదులు, పర్వతాలు, గ్రహాలు, నక్షత్రాలు, అగ్ని, వాయువు వంటి ప్రకృతి రూపాలను ధార్మిక చిహ్నాలు, మానవ సంబంధాలతో అనుసంధానించడం ద్వారా ప్రకృతి సమతుల్యత సందేశాన్ని అందించారు. ఈ సందేశాన్ని నేటి తరానికి చేరవేయడానికి యోగి ప్రభుత్వం ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో బర్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.

ప్రయాగరాజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ... ఫిబ్రవరి 1-2, 2025న ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో బర్డ్ ఫెస్టివల్ జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. యువతలో ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంచడం దీని ముఖ్య ఉద్దేశ్యమన్నారు. 

బర్ట్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు పర్యావరణ పర్యాటకానికి ఊతమిస్తాయన్నారు. ఉత్తరప్రదేశ్ జీవవైవిధ్యంతో కూడిన వన్యప్రాణుల అభయారణ్యాల గురించి సమాచారం ఇందులో అందించనున్నట్లు తెలిపారు. అడవులు, చారిత్రక ప్రదేశాలు, సహజ సౌందర్య ప్రాంతాలతో కూడిన సర్క్యూట్‌లను ఏర్పాటు చేయడంలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అరవింద్ కుమార్ తెలిపారు..

కుంభమేళాలోనే ఎందుకు? 

మహా కుంభమేళా వేళ ప్రయాగరాజ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామన్నారు.. ప్రయాగరాజ్‌లో 90 రకాల పక్షి జాతులు ఉన్నాయి... జిల్లాలోని చాలా చిత్తడి నేలలు వీటికి ఆశ్రయం కల్పిస్తున్నాయన్నట్లు తెలిపారు. ఈసారి బర్డ్ ఫెస్టివల్ ఇతివృత్తం 'కుంభ్ విశ్వాసం, ప్రకృతి సంరక్షణ, వాతావరణం'... ఈ రెండు రోజుల సదస్సులో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొని చర్చిస్తారని..సాదువులను కూడా ఇందులో భాగస్వాములను చేస్తామన్నారు. పరిసర ప్రాంతాల విద్యాసంస్థల విద్యార్థులకు కూడా ఇందులో అవకాశం కల్పిస్తారు... ఫోటో ప్రదర్శన కూడా నిర్వహిస్తామని ప్రయాగరాజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్  తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios