ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో హైటెక్ భద్రత...
ప్రయాగరాజ్ మహాకుంభ 2025 మేళాలో భద్రత పెంచారు. నిఘా వ్యవస్థ చురుగ్గా ఉంది, ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తున్నారు. సీఎం యోగి ఆదేశాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రయాగరాజ్ : నూతన సంవత్సరం సందర్భంగా మహాకుంభ నగరంలోని దేవాలయాలు, ఇతర ప్రధాన ప్రదేశాల్లో భద్రత పెంచారు. మహాకుంభ మేళా ప్రాంతం, ప్రయాగరాజ్ పట్టణంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేసారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆలోచన ప్రకారం సురక్షితంగాా మహా కుంభమేళా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అల్లరిమూకలు నగరంలోకి రాకుండా జిల్లాలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
సీఎం యోగి ఆలోచన ప్రకారం మహా కుంభమేళా భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాకుంభ నగరం సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ ద్వివేది మాట్లాడుతూ... ఈసారి మహాకుంభమేళాను చిరస్మరణీయంగా నిర్వహించాలని సీఎం యోగి కోరుకుంటున్నారని, అందుకే భద్రతను మరింత పటిష్టంగా, హైటెక్‌గా చేస్తున్నామని చెప్పారు. మహాకుంభపై ప్రపంచం దృష్టి ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా మహాకుంభ నగరం పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్నారు.
దేవాలయాలు, ఇతర ప్రధాన ప్రదేశాల్లో భద్రతను పెంచారు. మహాకుంభ, ప్రయాగరాజ్, చుట్టుపక్కల జిల్లాల్లో మూడు స్థాయిల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రతి భక్తుడి భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు పోలీసుల నిఘా బృందం చురుగ్గా పనిచేస్తోంది. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచడంతో పాటు, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతా కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. సీఎం యోగి ఆదేశాలతో మహాకుంభ నగరం పోలీసులు వివిధ ప్రదేశాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి, భద్రతను మరింత పటిష్టం చేశారు.
AI కెమెరాలు, డ్రోన్లు, యాంటీ డ్రోన్లు, టెథర్డ్ డ్రోన్లతో సైబర్ పెట్రోలింగ్ పెంపు
సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ ద్వివేది మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఈసారి డిజిటల్ మహాకుంభపై ప్రత్యేక దృష్టి సారించారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమంలో AI కెమెరాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. డ్రోన్లు, యాంటీ డ్రోన్లు, టెథర్డ్ డ్రోన్లను వివిధ ప్రాంతాల్లో మోహరించారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల సైబర్ భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సైబర్ పెట్రోలింగ్‌ను కూడా పెంచారు. మహాకుంభ నగరం భద్రత కోసం సమర్థులైన పోలీసు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు.