టాయిలెట్లకు QR కోడ్ ... స్కాన్ చేసిన క్షణాల్లోనే క్లీనింగ్ : ప్రయాగరాజ్ కుంభమేళాలో సరికొత్త టెక్నాలజీ

ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 లో భక్తులు, పర్యాటకుల కోసం 1.5 లక్షల మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని శుభ్రంగా వుంచేలా పర్యవేక్షించేందుకు యోగి సర్కార్ సరికొత్త ఏర్పాటు చేసింది. 

 

 

Prayagraj Mahakumbh 2025 Sanitation Leveraging QR Code Technology

ప్రయాగరాజ్ : సనాతన సంస్కృతి వారసత్వమైన ప్రయాగరాజ్ మహా  కుంభమేళాను స్వచ్ఛతకు ప్రతిరూపంగా నిలిపేలా యోగి సర్కార్ ఏర్పాట్లుచేసింది. ఇలా 2025 జనవరి, పిబ్రవవరి నెలల్లో జరిగే కుంభమేళాలో స్వచ్ఛతను పాటించేలా పిలుపునిచ్చింది. దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

మేళా ప్రాంతంతో పాటు పార్కింగ్ స్థలాల్లో 1.5 లక్షల టాయిలెట్స్, యూరినల్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటు బాగానే వుంది... కానీ అతి పెద్ద సవాలు వీటిని శుభ్రంగా ఉంచడమే. దీనికోసం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. QR కోడ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా టాయిలెట్స్ స్వచ్ఛతను పరిశీలిస్తారు. ప్రత్యేక యాప్ ద్వారా ఏ టాయిలెట్లో మురికి ఉందో తెలుసుకుని కొద్ది నిమిషాల్లో శుభ్రం చేస్తారు. ఇలా శుభ్రం చేయడానికి జెట్ స్ప్రే క్లీనింగ్ వాడతారు... ఎక్కడా మాన్యువల్ గా శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు. సెప్టిక్ ట్యాంక్ ఖాళీ చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు.

యాప్ ఆధారిత ఫీడ్ బ్యాక్

జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాకు ఈసారి 40 కోట్లకు పైగా భక్తులు, పర్యాటకులు వస్తారని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేళా ప్రాంతం మొత్తం 1.5 లక్షల టాయిలెట్స్, యూరినల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిని శుభ్రంగా ఉంచడానికి కూడా భారీ ఏర్పాట్లు చేశారు... ఇందుకోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

కుంభమేళా ప్రత్యేక అధికారిణి ఆకాంక్ష రాణా మాట్లాడుతూ... స్వచ్ఛత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈసారి QR కోడ్ తో స్వచ్ఛతను పర్యవేక్షిస్తామన్నారు. యాప్ ఆధారిత ఫీడ్ బ్యాక్ ద్వారా త్వరగా శుభ్రం చేయిస్తామన్నారు.

ఈ టాయిలెట్స్ అన్నింటినీ పర్యవేక్షించే బాధ్యత 1500 మంది గంగా సేవా దూతలకు అప్పగించామని, వారు ప్రతి టాయిలెట్ ను ఉదయం, సాయంత్రం పరిశీలిస్తారని ఆమె చెప్పారు. వారు ఐసిటి యాప్ ద్వారా ప్రతి టాయిలెట్ పై ఉన్న QR కోడ్ స్కాన్ చేసి, యాప్ లో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. టాయిలెట్ శుభ్రంగా ఉందా, తలుపు పగిలిపోయిందా, నీళ్ళు ఉన్నాయా వంటి ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలు సబ్మిట్ చేయగానే కంట్రోల్ రూమ్ కు ఫీడ్ బ్యాక్ వెళ్తుంది. ఏ టాయిలెట్ లో శుభ్రత సరిగ్గా లేదో సంబంధిత వెండర్లకు సమాచారం వెళ్తుంది. వెంటనే వారు శుభ్రం చేస్తారు. గంగా సేవా దూతలు మాత్రమే కాదు, సామాన్యులు కూడా ఈ ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు.

మాన్యువల్ గా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు

ఈసారి మాన్యువల్ గా టాయిలెట్స్ శుభ్రం చేయాల్సిన అవసరం లేదని ఆకాంక్ష రాణా చెప్పారు. జెట్ స్ప్రే క్లీనింగ్ వ్యవస్థ ద్వారా కొద్ది సెకన్లలో టాయిలెట్స్ ను పూర్తిగా శుభ్రం చేయవచ్చు. జెట్ స్ప్రే క్లీనింగ్ వ్యవస్థలో నీటిని అధిక పీడనంతో వదులుతారు, దీనివల్ల ఏ మురికినైనా తొలగించడం సులభం. ఇదే విధమైన క్లీనింగ్ వ్యవస్థను రైల్వే టాయిలెట్స్ శుభ్రం చేయడానికి కూడా వాడతారు. సెప్టిక్ ట్యాంక్ ఖాళీ చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. దీని ద్వారా మేళా ప్రాంతంలోని టాయిలెట్స్ సెప్టిక్ ట్యాంక్ ను ఖాళీ చేసి, వ్యర్థాలను ఎస్టీపీ ప్లాంట్ లేదా ఇతర ప్రదేశాలకు తరలిస్తారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios