కుంభమేళాకు సిద్దమవుతున్న ప్రయాగరాజ్‌ ... ఏ పనులు ఎలా జరుగుతున్నాయంటే...

మహా కుంభం 2025 కోసం ప్రయాగరాజ్‌లో జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఘాట్ల అభివృద్ధి, పాంటూన్ వంతెనల నిర్మాణం, మేళా ప్రాంతంలో విద్యుత్, నీటి వంటి సౌకర్యాల పనులు వేగంగా జరుగుతున్నాయి 

Prayagraj Mahakumbh 2025 Preparations Underway City Transforming AKP

ప్రయాగరాజ్ : మహా కుంభమేళా-2025 కోసం ప్రయాగరాజ్ రూపురేఖలు మారడం ప్రారంభమైంది. కుంభ నగరి, గంగా, యమునా, సంగమ ఘాట్ల వద్ద పనుల వేగం పెరిగింది. సీఎం యోగి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నవంబర్ 15 నాటికి పూర్తి చేయనుంది. అదేవిధంగా మేళా ప్రాంతంలోని పనులను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేస్తారు.

గంగా నది నీటి మట్టం తగ్గడంతో మేళా ప్రాంతంలో భూమిని చదును చేసే పని వేగంగా సాగుతోంది. మొత్తం మేళా ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేస్తున్నారు. విద్యుత్ తీగలు, లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో మేళా ప్రాధికార సంస్థ కార్యాలయం నిర్మాణం ప్రారంభమైంది. పోలీసులు భద్రత కోసం సిద్ధమవుతున్నారు. మేళా ప్రాంతంలో పోలీసులు మోహరించారు, వారి కోసం బ్యారక్‌లు నిర్మించారు. ప్రస్తుతం పోలీసులకు మేళా ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లపై శిక్షణ ఇస్తున్నారు.

పిడబ్యూడీ అధికారులు పాంటూన్ వంతెనల నిర్మాణం ప్రారంభించారు. గంగా నది నీటి మట్టం తగ్గే కొద్దీ ఈ పనుల వేగం పెరుగుతుంది. ప్రస్తుతం ఓల్డ్ జీటీ రోడ్డుపై రెండు, గంగోలి శివాలయ మార్గం, హరిశ్చంద్ర ఘాట్ వద్ద ఒక్కో పాంటూన్ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ఈసారి 30 పాంటూన్ వంతెనలు నిర్మిస్తారు.

నగరంలో గోడలపై చిత్రలేఖనతో పాటు కూడళ్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన రహదారుల పునర్నిర్మాణం జరుగుతోంది. చాలా వరకు రోడ్లు నిర్మించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, రాకపోకలు సజావుగా సాగేలా ఘాట్ల చుట్టూ కూడా రోడ్లు వేశారు.

4200 హెక్టార్లలో ఏర్పాటవుతున్న మేళా ప్రాంతంలో 10,000 కంటే ఎక్కువ సంస్థలు తమ టెంట్లు వేసుకోనున్నాయి. మేళా ప్రాంత పనులను పర్యవేక్షిస్తున్న ఓ అధికారి మాట్లాడుతూ, మహా కుంభంలో లక్షకు పైగా టెంట్లు వేస్తారని తెలిపారు. కల్పవాసుల కోసం ఖాక్ చౌక్, దండిబాడ, ఆచార్య బాడ, ప్రయాగ్వాల్‌లో ఏర్పాట్లు ఉంటాయి.

అదనపు కుంభ మేళాధికారి వివేక్ చతుర్వేది మాట్లాడుతూ.... ఈ కుంభమేళాకు వచ్చే కల్పవాసులు, భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోపు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios