ఏం స్వాగతం గురూ..! ప్రయాగరాజ్ కుంభమేళాలో కేవలం ఆహ్వానం కోసమే అన్ని కోట్లు ఖర్చా?

మహా కుంభమేళా 2025 కోసం ప్రయాగరాజ్‌లో నాలుగు దిశల్లో గ్రాండ్ ఎంట్రన్స్ గేట్లు నిర్మిస్తోంది. ఇలా యోగి సర్కార్ భక్తులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి సిద్ధమవుతోంది.

Prayagraj Mahakumbh 2025 Grand Welcome Gates for Pilgrims AKP

ప్రయాగరాజ్ : ఉత్తర ప్రదేశ్ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రయాగరాజ్ మహా కుంభమేళా ద్వారా దేశ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది యోగి సర్కార్. ఇందులో భాగంగానే ప్రయాగరాజ్ నగరం, జిల్లా సరిహద్దులను సాంప్రదాయబద్దంగా అలంకరిస్తున్నారు. కుంభమేళాకు విచ్చేసే భక్తులు, పర్యాటకులకు యూపీ స్టైల్లో స్వాగతం పలుకుతూ జిల్లా సరిహద్దుల్లో నాలుగు గొప్ప ప్రవేశ ద్వారాల నిర్మాణం చేపడుతున్నారు. 

 జిల్లా సరిహద్దుల్లో భక్తులకు ఘన స్వాగతం

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో "అతిథి దేవో భవ" అనే సూత్రాన్ని పాటిస్తోంది యోగి సర్కార్. కాబట్టే కుంభమేళాకు వచ్చే భక్తులకు జిల్లా సరిహద్దుల్లోనే ఘన స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ఇలా అన్ని దిశల నుండి వచ్చే భక్తులు, పర్యాటకులకు నాలుగు గొప్ప ప్రవేశ ద్వారాలు స్వాగతం పలుకుతాయి. వీటిని  సీ&డీఎస్ (కన్ట్రక్షన్ ఆండ్ డిజైన్ సర్వీసెస్) నిర్మిస్తోంది..

సీ&డీఎస్ ప్రాజెక్ట్ మేనేజర్ రోహిత్ కుమార్ రానా మాట్లాడుతూ... మహా కుంభమేళాకి వచ్చే భక్తులకు జిల్లాలోకి అడుగు పెట్టగానే కుంభ నగరి ప్రయాగరాజ్ యొక్క ధార్మిక, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని అన్నారు. నాలుగు దిశల్లో గొప్ప ప్రవేశ ద్వారాలు నిర్మిస్తున్నారు... వీటిలో మూడు ద్వారాలను 2019 కుంభ్ సమయంలో నిర్మించారు, వాటిని ఇప్పుడు పునరుద్ధరిస్తున్నారు. నాల్గవ ద్వారం శివ ద్వారం నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. దీని నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు.  

రూ.18.93 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం, పునరుద్ధరణ

ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు రోడ్డు మార్గం ద్వారా వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్యే అత్యధికంగా ఉంటుంది. సుమారు 30 కోట్ల మందికి పైగా భక్తులు రోడ్డు మార్గం ద్వారా కుంభ నగరికి వస్తారని అంచనా. ప్రయాగరాజ్ జిల్లాలోకి అడుగు పెట్టగానే గంగా, యమునా, సరస్వతి, శివ ద్వారాలు భక్తులకు స్వాగతం పలుకుతాయి.  రూ.18.93 కోట్ల బడ్జెట్ తో వీటి నిర్మాణం, పునరుద్ధరణ జరుగుతోంది.

నాల్గవ శివ ద్వారం నిర్మాణం నేషనల్ హైవే 319 లో ప్రయాగరాజ్ ను జౌన్పూర్, గోరఖ్‌పూర్ లకు కలిపే రహదారిపై జరుగుతోంది. 4.95 కోట్ల బడ్జెట్ తో శివ ప్రవేశ ద్వారం నిర్మిస్తున్నారు. ద్వారం మధ్యలో ధ్యాన యోగ ముద్రలో శివుని విగ్రహం ప్రతిష్టిస్తారు. 2019 కుంభ్ సమయంలో యోగి ప్రభుత్వం నిర్మించిన గంగా, యమునా, సరస్వతి ప్రవేశ ద్వారాల పునరుద్ధరణ, అలంకరణ పనులు కూడా జరుగుతున్నాయి. క్లాడింగ్, మ్యూరల్స్ నిర్మాణం 25 శాతం పూర్తయింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios