మహా కుంభం 2025 లో తొలిసారిగా డ్రోన్ షో నిర్వహించనున్నారు. సంగమం వద్ద 2000 డ్రోన్లు మహా కుంభం, ప్రయాగ పురాణ గాథలను ప్రదర్శిస్తాయి. భక్తులకు ఇది కొత్త అనుభూతినిస్తుంది.
ప్రయాగరాజ్ : మహా కుంభమేళా 2025 త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమం కావడంతో ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలోచనల ప్రకారం ప్రయాగరాజ్‌లోని ఆలయాలు, గంగా ఘాట్లు, పార్కులు, రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, అభివృద్ధి చేస్తున్నారు. ఈ కుంభమేళాకు వచ్చే భక్తులు, పర్యాటకులకు కొత్త అనుభవాలు కల్పించనున్నారు. యూపీ టూరిజం శాఖ తొలిసారిగా డ్రోన్ షో నిర్వహించనుంది. సంగమం వద్ద సాయంత్రం వేళ ఈ అద్భుత దృశ్యాలు ఆకాశంలో చూడవచ్చు.
స్పెషల్ డ్రోన్ షో
ప్రతి 12 ఏళ్లకోసారి ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా జరుగుతుంది. ఇల 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా ఉంటుంది. ఇందుకోసం చాలారోజుల ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించనగా ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. సీఎం యోగి ఆదేశాలతో యూపీ టూరిజం శాఖ భక్తులు, పర్యాటకులకు కొత్త అనుభూతులు అందించేందుకు కృషి చేస్తోంది.
ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, వాటర్ యాక్టివిటీస్, హాట్ ఎయిర్ బెలూన్, లేజర్ లైట్ షోలతో పాటు తొలిసారిగా డ్రోన్ షో నిర్వహిస్తున్నారు. జిల్లా పర్యాటక అధికారి అపరాజిత సింగ్ మాట్లాడుతూ.. మహా కుంభం ప్రారంభ, ముగింపు సమయాల్లో సంగమం వద్ద డ్రోన్ షో నిర్వహిస్తామని, ఇది కొత్త అనుభూతినిస్తుందని చెప్పారు. దాదాపు 2000 లైటింగ్ డ్రోన్ల ద్వారా కుంభమేళా పురాణ గాథలను ప్రదర్శిస్తాయి. సముద్ర మథనం, అమృత కలశం వంటి దృశ్యాలు ప్రదర్శిస్తారు. ప్రయాగ ధార్మిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా చూపిస్తారు.
2000 లైటింగ్ డ్రోన్ల ప్రదర్శన
మహా కుంభం 2025 అనేక విధాలుగా ప్రత్యేకంగా నిలుస్తుంది. యూపీ టూరిజం కొత్త ప్రయోగాలు చేస్తోంది. జనవరి మొదటి వారం నుంచి కాళీ ఘాట్, యమునా నదిలో మ్యూజికల్ ఫౌంటెన్ లేజర్ షో ప్రారంభం కానుంది. ఇది పర్యాటకులకు కొత్త అనుభూతినిస్తుంది. లైటింగ్ డ్రోన్ షో కూడా ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. దాదాపు 2000 లైటింగ్ డ్రోన్లు ఒకదానికొకటి సమన్వయంతో సంగమం ఆకాశంలో అద్భుత దృశ్యాలు, రంగులు చిందిస్తాయి. ఇవన్నీ ధార్మిక, ఆధ్యాత్మిక భావనతో ఉంటాయి.
