ప్రయాగరాజ్ మహా కుంభమేళా కోసం IRS ఏర్పాటు... ఇంతకూ ఏమిటిది?
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా చూసేందుకు యోగి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ (IRS) ఏర్పాటు చేసారు.
మహాకుంభ్ నగర్ : ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో ప్రమాదాలు జరక్కుండా యోగి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన బలగాలను మోహరించారు. ప్రమాద సమయాల్లో తక్షణ స్పందన కోసం ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ (IRS) ఏర్పాటు చేశారు. మండల, జిల్లా, మేళా స్థాయిల్లో అధికారుల బాధ్యతలు నిర్ణయించారు. మేళా ప్రాంతంలో ఏదైనా ఆపద సంభవిస్తే బాధ్యతాయుత బృందం వెంటనే చర్యలు తీసుకుంటుంది.
మండలాధికారి బాధ్యత
యోగి ప్రభుత్వం రెవెన్యూ శాఖ అధికారులతో ఈ IRSను ఏర్పాటు చేసింది. ప్రయాగరాజ్ పరిధిలోని మండలాధికారి, మేళా ప్రాధికారణ అధ్యక్షుడు ఈ ఐఆర్ఎస్ బాధ్యత వహిస్తారు. పోలీస్ కమిషనర్ భద్రతా బాధ్యతలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డిడిఎంఏ అధ్యక్షుడు ఇన్సిడెంట్ కమాండర్‌గా, అదనపు కలెక్టర్ డిప్యూటీ ఇన్సిడెంట్ కమాండర్‌గా, డిసిపి నగర్ భద్రతాధికారిగా వ్యవహరిస్తారు.
ప్రధాన కార్యదర్శి పి. గురుప్రసాద్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2025 ప్రయాగరాజ్ మహాకుంభ్ సజావుగా నిర్వహించేందుకు, ఏదైనా ఆపద సంభవిస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు IRS ఏర్పాటు చేశారు. మేళా ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి, ఆపద సంభవిస్తే బాధ్యతాయుత బృందం చర్యలు తీసుకుంటుంది.