ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025: విక్టిమ్ లోకేషన్ కెమెరాతో అత్యాధునిక వెహికిల్

మహా కుంభమేళా 2025లో విపత్తులను ఎదురించడానికి అత్యాధునిక మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వెహికల్ సిద్ధం చేయబడింది. ఈ వాహనంలో అనేక ఆధునిక సదుపాయాలు, పరికరాలు ఉన్నాయి.అవేంటో చూద్దాం. 

  

Prayagraj Mahakumbh 2025 Disaster Management Advanced Vehicle Deployed AKP

ప్రయాగరాజ్: మహా కుంభమేళా 2025 ఏర్పాట్లలో భాగంగా మరో కీలక చర్య తీసుకుంది యోగి సర్కార్. ఏ విధమైన విపత్తునైనా ఎదుర్కొనేందుకు అత్యాధునిక మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వెహికల్‌ను రంగంలోకి దింపారు. ఈ వాహనంలో అనేక ఆధునిక సదుపాయాలు, పరికరాలు ఉన్నాయి, ఇవి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించడంలో, విపత్తు నిర్వహణను సులభతరం చేయడంలో సహాయపడతాయి.

విక్టిమ్ లోకేషన్ కెమెరా

మహా కుంభమేళా చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ శర్మ మాట్లాడుతూ...  ఈ వాహనం అనేక అత్యాధునిక పరికరాలతో సన్నద్ధమైంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి రోడ్డు ప్రమాదాల వరకు అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. 10 నుంచి 20 టన్నుల సామర్థ్యం గల లిఫ్టింగ్ బ్యాగుల సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని సులభంగా బయటకు తీసుకురావచ్చు. అంతేకాదు 1.5 టన్నుల బరువున్న వస్తువులను ఎత్తడానికి, తరలించడానికి ప్రత్యేక యంత్రాలు అమర్చారు. విపత్తు సమయంలో గట్టి శిథిలాలను కత్తిరించడానికి, తొలగించడానికి ప్రత్యేక పరికరాలు ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి విక్టిమ్ లోకేషన్ కెమెరా కూడా ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాలను నడపడానికి ఇన్‌బిల్ట్ జనరేటర్ ఉంది. రక్షణ సిబ్బంది భద్రత కోసం లైఫ్ జాకెట్లు, లైఫ్ రింగ్‌లు, రెస్క్యూ కాంటా వంటివి ఉన్నాయి. అగ్ని ప్రమాదాల సమయంలో ఉష్ణోగ్రతను కొలవడానికి టెంపరేచర్ కొలిచే పరికరం కూడా ఉంది.

విపత్తులను ఎదుర్కోవడం ఇక సులభం 

ఈ మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వెహికల్ రావడంతో మహా కుంభమేళా సమయంలో ఏర్పడే విపత్తులను ఎదుర్కోవడంలో అధికారులకు ఎంతో సహాయపడుతుంది. ఇది కేవలం కుంభమేళాకే కాకుండా ఇతర విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ అత్యాధునిక వాహనం విపత్తు నిర్వహణను మరింత బలోపేతం చేస్తుంది.   మహా కుంభమేళా లాంటి భారీ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తుల భద్రత విషయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios