ప్రయాగరాజ్ మహా కుంభమేళా ఎఫెక్ట్ : వ్యాపారులకు లాభాల పంట

ప్రయాగరాజ్ మహా కుంభమేళా బ్రాండింగ్ వల్ల వ్యాపారాల్లో జోరు పెరిగింది. ఈ కుంభమేళా థీమ్ ఉన్న వస్తువులు, ముఖ్యంగా నూతన సంవత్సర కానుకలకు డిమాండ్ 20-25% పెరిగింది.  

Prayagraj Mahakumbh 2025 boosts local businesses sales of themed products AKP

ప్రయాగరాజ్ : త్రివేణి సంగమ తీరాన జరగబోయే మహా కుంభమేళా వ్యాపారాల మీద ప్రభావం చూపడం మొదలైంది. ఈ కుంభమేళా లోగో, చిహ్నం ఉన్న వస్తువుల అమ్మకాలు పెరిగాయి. నూతన సంవత్సర కానుకలకు ఇది మరింత ఊపునిచ్చింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యంమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర ప్రభుత్వం 2025 ఆరంభంలో జరగబోయే మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించడానికి కృషి చేస్తోంది. ఇప్పటికే భారీగా బ్రాండింగ్ చేయడంవల్ల వ్యాపారాలు కూడా బాగా పెరిగాయి.

వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మహేంద్ర గోయల్ మాట్లాడుతూ... ప్రతి వ్యాపారానికీ సెంటిమెంట్ ఉంటుందని తెలిపారు. అయోధ్యలో రామాలయ ప్రతిష్ట సమయంలో రామాలయం, సనాతన ధర్మ చిహ్నాల వస్తువులకు భారీ డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. ప్రయాగరాజ్ మహాకుంభం బ్రాండింగ్ వల్ల సంబంధిత వస్తువుల అమ్మకాలు 20-25% పెరిగాయని... దీంతో వ్యాపారులు సంతోషంగా ఉన్నారన్నారు. భవిష్యత్తులో ఇది ఇంకా పెరుగుతుందని ఆయన అన్నారు.

నూతన సంవత్సర కానుకలకు డిమాండ్

నూతన సంవత్సరంలో కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. స్టేషనరీ వస్తువులకు మరింత డిమాండ్ ఉంటుంది. ప్రయాగరాజ్‌లో కొంతమంది దుకాణదారులు మహాకుంభం థీమ్‌తో స్టేషనరీ వస్తువులు అమ్మకానికి పెట్టారు. జీరో రోడ్డులోని భగవతి పేపర్స్ ట్రేడింగ్ యజమాని అరవింద్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ... మహాకుంభం థీమ్‌తో 14 రకాల స్టేషనరీ వస్తువులు అమ్మకానికి పెట్టామని, వాటికి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. డైరీలు, ఫైల్ బాక్సులు, క్యాలెండర్లు, పెన్నులు, కీ రింగుల వంటి వాటిపై మహాకుంభం లోగో, చిహ్నాలు ముద్రించామని... వాటికి డిమాండ్ పెరిగిందని ఆయన తెలిపారు. ప్రయాగరాజ్ వెలుపలి నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని, వాటిని తీర్చలేకపోతున్నామని అరవింద్ కుమార్ అగర్వాల్ అన్నారు.

జ్యూట్, కాటన్ బ్యాగుల హోల్ సేల్ వ్యాపారి గోపాల్ పాండే మాట్లాడుతూ... యోగి ప్రభుత్వం ప్లాస్టిక్‌ను నిషేధించడంతో జ్యూట్, కాటన్ బ్యాగులకు డిమాండ్ పెరిగిందన్నారు. వాటిపై మహా కుంభమేళా చిహ్నాలు ముద్రిస్తున్నామని, ఇప్పటికే 25 వేలకు పైగా బ్యాగులకు ఆర్డర్లు వచ్చాయని ఆయన ఆనందంతో చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios