మహా కుంభమేళా టెక్నాలజీమయం... చెత్త సేకరణకు కూడా అత్యాధునిక పరికరాలు

ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025లో పరిశుభ్రత కోసం అధునాతన పరికరాలను ఉపయోగించనున్నారు. మాన్యువల్ స్వీపింగ్ మెషీన్లతో పాటు బ్యాటరీతో నడిచే చెత్త సేకరణ యంత్రాలను మోహరించనున్నారు.  

Prayagraj Mahakumbh 2025 Advanced Cleaning Technology for Pilgrims AKP

 ప్రయాగరాజ్ మహా కుంభమేళా : దేశ వివిదేశాల నుండి ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు వచ్చే భక్తులు, పర్యాటకులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించడానికి అధునాతన పరిశుభ్రతా పరికరాలను ఉపయోగించనున్నారు. దీనికోసం ప్రయాగరాజ్ మేళా అథారిటీ సన్నాహాలు పూర్తి చేసింది. మేళా ప్రారంభానికి ముందే ఈ అధునాతన పరికరాలను మోహరిస్తున్నారు. ఈ పరికరాల కొనుగోలుకు 45 నుండి 50 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తుననారు. ఈ పరికరాల్లో 10 మాన్యువల్ వాక్ బిహైండ్ స్వీపింగ్ మెషీన్లు, 2 బ్యాటరీతో నడిచే వాక్యూమ్ టైప్ లిట్టర్ పికర్లు ఉన్నాయి. ఈ చర్య కుంభమేళాలో పరిశుభ్రతను అందించడమే కాకుండా భక్తులకు హరిత వాతావరణాన్ని కూడా అందిస్తుంది.

మహా కుంభమేళా 2025 సందర్భంగా దేశవిదేశాల నుండి వచ్చే భక్తులు, పర్యాటకులు, పుణ్యస్నానం ఆచరించే వారికి మెరుగైన సౌకర్యం, సరికొత్త అనుభూతిని అందించడానికి మేళా ప్రాంతంలోని ఘాట్‌లు, ఫుట్‌పాత్‌లు, రోడ్లు,  వివిధ ప్రదేశాలను శుభ్రపరచడానికి కాంపాక్ట్ మాన్యువల్ స్వీపింగ్ మెషీన్‌ను ఉపయోగిస్తారు.  ఇది ఇంధనం లేదా విద్యుత్ అవసరం లేకుండా పనిచేస్తుంది, దీనివల్ల అది పర్యావరణానికి హాని కలిగించకుండా వుంటుంది. 

 ఈ క్లీనింగ్ మెషీన్‌ను మాన్యువల్‌గా నడుపుతారు... దీనివల్ల ధూళి లేకుండా శుభ్రపరచబడుతుంది. అయితే రోడ్లను శుభ్రపరచడంలో ఇది సమర్దవంతంగా పనిచేస్తుంది... దానిని నడపడం,  నిర్వహణను సులభతరం చేస్తుంది. ఈ పరికరం పారిశుధ్య కార్మికుల పనులను మరింత సమర్థవంతంగా,  ప్రభావవంతంగా చేయడంతోపాటు పరిశుభ్రమైన, పర్యావరణాన్ని పరిరక్షించడానికి దోహదపడేలా చేస్తుంది.

బ్యాటరీతో నడిచే యంత్రాలు

శుభ్రపరచడానికి బ్యాటరీతో నడిచే వాక్యూమ్ టైప్ లిట్టర్ పికర్‌ను కూడా మేళా ప్రాంతంలో చేర్చుతారు. ఈ చెత్త సేకరణ యంత్రం బ్యాటరీతో నడుస్తుంది. ఇది చెత్త, శిథిలాలను సేకరించడానికి రూపొందించబడింది. ఇది మేళాలో వివిధ ప్రాంతాలను సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. దీని కాంపాక్ట్ పరిమాణం మేళా ప్రాంతంలోని ఏ ప్రాంతంలోనైనా సులభంగా నడపడానికి వీలు కల్పిస్తుంది.

ఈ అధునాతన, పర్యావరణ అనుకూల పరికరం వాహనానికి అనుసంధానించబడి ఉంది, ఇది మాన్యువల్ శ్రమ అవసరం లేకుండా అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది.   దీని శక్తివంతమైన వాక్యూమ్ వ్యర్థ పదార్థాలను త్వరగా, పూర్తిగా, సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. అ 

 మేళా ప్రాంతాన్ని శుభ్రపరచడానికి ఈ పరికరాల కొనుగోలుకు దాదాపు 45-50 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. ఈ ఖర్చును ప్రయాగరాజ్ మేళా అథారిటీ భరిస్తుంది. అథారిటీ బోర్డు సమావేశంలో వీటి కొనుగోలుకు ఆమోదం లభించింది.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios