ప్రయాగరాజ్ కుంభమేళాకు ఇన్ని కోట్లమంది వస్తారా! మరి వారినెలా కంట్రోల్ చేస్తారో తెలుసా?

2025లో జరిగే ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో దాదాపు 40 కోట్లకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఇంతటి జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి యోగి సర్కార్ ప్లాన్స్ సిద్దం చేసింది. అవేంటంటే...

 

 

Prayagraj Maha Kumbh 2025 Crowd Management Plan Ensures Smooth Devotee Flow AKP

ప్రయాగరాజ్ : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా 2025 కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ప్రయాగరాజ్ కుంభమేళాలో ప్రతిఒక్కరూ పాల్గొనేలా... ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా యోగి సర్కార్ కృషి చేస్తోంది. ఈ మహా కార్యక్రమంలో దేశ విదేశాల నుండి దాదాపు 40 కోట్లకు పైగా ప్రజలు ప్రయాగరాజ్‌ బాట పడతారనిఅంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మేళా బాధ్యతలు చూసుకుంటున్న ప్రత్యేక అధికారులే కాదు జిల్లా అధికారులు కూడా జనసమూహాల నిర్వహణకు సన్నాహాలు చేశారు.

2025 జనవరి, పిబ్రవరి నెలల్లో ఈ కుంభమేళా జరుగుతుంది... ఈ రెండు నెలలపాటు భక్తులు, పర్యాటకుల తాకిడి ఎక్కువగా వుంటుంది. మరీముఖ్యంగా ప్రత్యేక రోజుల్లో రద్దీ మరీ ఎక్కువగా వుంటుంది. కాబట్టి ఇలాంటి రోజుల్లో ఎక్కడా గందరగోళం లేకుండా ఉండేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులు. రాకపోకలకు వేర్వేరు మార్గాలు ఏర్పాటుచేసారు. ప్రయాణం సాఫీగా సాగేలా... ఎక్కడా ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, ట్రాఫిక్ జామ్ జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఓ ప్రణాళిక ప్రకారం రద్దీ రోజుల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.   

కుంభమేళా ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయంటే : 

ప్రయాగరాజ్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ మాట్లాడుతూ... ఈ అతిపెద్ద మతపరమైన కార్యక్రమానికి కేవలం ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండే కాదు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాగరాజ్‌కు వస్తారని అన్నారు. ఇలా ఎంతో భక్తితో వచ్చే ఏ భక్తుడికీ ఇబ్బంది కలగకూడదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారని  తెలిపారు. ఆయన సలహాలు సూచనల మేరకు జనసమూహాల నిర్వహణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు కమీషనర్ తెలిపారు.

మహా కుంభమేళా సమయంలో అత్యధిక భక్తులు రోడ్డు మార్గం ద్వారా ప్రయాగరాజ్‌కు చేరుకుంటారు. కాబట్టి ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు చాలా కీలకమైన అంశాలు. ఇందుకోసం ప్రయాగరాజ్ అన్నివైపులా పార్కింగ్ ఏర్పాట్లు చేశామని... విశాలమైన ఆ  పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలిపి భక్తులు ముందుకు వెళతారన్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య వుండదన్నారు.

మేళా ప్రాంతంలో రాకపోకలకు వేర్వేరు మార్గాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పవిత్ర స్నానం ఆచరించే భక్తులు వెళ్ళే మార్గంలో తిరిగి రారు... ఓ మార్గంలో వెళ్లి మరో మార్గంలో తిరిగి వస్తారన్నారు. దీనివల్ల భక్తులు ఎదురెదురుగా రాకుండా వుంటారు.. కాబట్టి తోపులాటలు, ఇతర సమస్యలు వుండవని కమీషనర్ వెల్లడించారు.

భక్తులు ఒకేచోట ఆగకుండా ముందుకు వెళ్తూ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. మేళా ప్రాంతంతో పాటు నగరంలో కూడా భక్తుల రాకపోకలు సజావుగా సాగేలా చూస్తున్నామన్నారు.. స్నానం, దర్శనం తర్వాత వారు నేరుగా పార్కింగ్ స్థలానికి చేరుకుని తమ గమ్యస్థానాలకు వెళ్లేలా చూస్తామన్నారు.

ఇక రైల్వే శాఖను సకాలంలో ఎక్కువ స్పెషల్ రైళ్లు నడపాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు రైల్వే అధికారుల నుండి సానుకూల స్పందన వచ్చింది... అదనపు స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు ప్రకటించారన్నారు. భక్తులు కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే వారి కోసం కొన్ని హోల్డింగ్ ప్రాంతాలను కూడా సిద్దం చేసినట్లు కమీషనర్ వెల్లడించారు.

కుంభమేళాలో స్పెషల్ ట్రాఫిక్ ప్లాన్స్ : 

మహా కుంభమేళా ప్రారంభంతోనే ప్రయాగరాజ్‌కు భక్తులు రావడం ప్రారంభమవుతుంది. ఇక కొన్ని ప్రత్యేక రోజుల్లో భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. ముఖ్యంగా మౌని అమావాస్య రోజున 4 నుంచి 5 కోట్ల మంది భక్తులు సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడానికి వస్తారని అంచనా. ఈ రద్దీకి తగినట్లుగా అధికారులు సన్నాహాలు చేశారు. ఇలాంటి రద్దీ రోజుల్లో వచ్చే భక్తులు ఒకటి నుంచి 5 కిలోమీటర్లు, సాధారణ రోజుల్లో కేవలం ఒక్క కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం కూడా నడవనవసరం లేకుండా ఏర్పాట్లు చేసినట్లువిజయ్ విశ్వాస్ పంత్ తెలిపారు.

మౌని అమావాస్య రోజున అత్యధిక రద్దీ ఉంటుంది. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో భక్తులు సంగమ స్నానానికి వెళ్ళడం, తిరుగుపయనం కావడం జరుగుతుంది. కాాబట్టి సులభంగా సంగమ ప్రాంతానికి చేర్చడానికి, తిరిగి పార్కింగ్ స్థలానికి చేరుకోడానికి ఏర్పాట్లు చేసారు. పవిత్ర స్నానం తర్వాత వెంటనే వారిని తిరిగి పంపిస్తాం... దీనివల్ల రద్దీని నియంత్రించవచ్చని అధికారులు తెలిపారు

పార్కింగ్ స్థలానికి చేరుకున్న వారు వెంటనే అక్కడినుండి వెళ్లిపోయేలా చూసుకుంటామని తెలిపారు. ఇలా భక్తులు పార్కింగ్ స్థలంనుండి బయలుదేరి తిరిగి అక్కడికి చేరుకునేంతవరకు వివిధ ట్రాఫిక్ ప్లాన్స్ సిద్ధం చేశామన్నారు. దీనివల్ల భక్తులకు ఇబ్బంది ఉండదు... మేళా ప్రాంతంతో ట్రాఫిక్ గందరగోళం ఉండదన్నారు.

ఇండోర్ బయో ఫ్రెండ్లీ సంచులు

ఈ మహా కుంభమేళాను స్వచ్ఛ కుంభమేళాగా మార్చాలనే ముఖ్యమంత్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. మొత్తం మేళా ప్రాంతంలో ఎలాంటి ప్లాస్టిక్ వాడకం ఉండకుండా ప్రయత్నాలు చేస్తున్నామని... దీనికి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ కు బదులు ఇండోర్ బయో ఫ్రెండ్లీ సంచులను ఉపయోగించేల వ్యాపారులతో చర్చిస్తామన్నారు. ప్లాస్టిక్ బదులు వివిధ రకాల సంచులను ఉపయోగించమని ప్రజలు, వ్యాపారులను ప్రోత్సహిస్తున్నామని కమీషనర్ తెలిపారు. .

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios