ప్రయాగరాజ్ మహా కుంభం 2025: యోగి ఏర్పాట్లకు శంకరాచార్యుల ప్రశంస
శంకరాచార్య స్వామి వాసుదేవానంద సరస్వతి మహా కుంభం 2025 ఏర్పాట్లకు సీఎం యోగిని ప్రశంసించారు. ప్రయాగరాజ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సాంస్కృతిక పునర్జాగరణ కృషి అద్భుతమని అన్నారు. సమాజంలో చిచ్చు పెట్టే వారిని దూరం పెట్టాలని సూచించారు.
ప్రయాగరాజ్ : మహా కుంభమేళా 2025 కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుందో అందరికీ తెలిసిందే. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలనుండే కాదు ప్రముఖుల నుండి ప్రశంసంలు అందుకుంటున్నారు. తాజాగా జ్యోతిష్పీఠ శంకరాచార్య స్వామి వాసుదేవానంద సరస్వతి కూడా సీఎం యోగిని ప్రశంసించారు. ప్రయాగరాజ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు చాలా బాగున్నాయని... మహా కుంభమేళా ఏర్పాట్లను ఈ స్థాయిలో చేస్తున్న సీఎం యోగి ధన్యవాదాలు చెబుతున్నానని స్వామి అన్నారు.
ప్రభుత్వం పూర్తి శ్రద్ధతో కుంభమేళా ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ముఖ్యమంత్రి యోగి కార్యకలాపాల్లో కనిపిస్తుందని అన్నారు. సాంస్కృతిక పునరుజ్జీవనం, సనాతన ధర్మ పరిరక్షణకు పీఎం మోదీ, సీఎం యోగి చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.
సంస్కృతికి కాపాడేందుకు పీఎం, సీఎం కృషి
అయోధ్యలో రామమందిరం, కాశీలో విశ్వనాథ్ కారిడార్, వింధ్య కారిడార్ వంటి ధార్మిక క్షేత్రాల అభివృద్ధికి పీఎం మోదీ, సీఎం యోగి కృషి చేస్తున్నారని శంకరాచార్యులు అన్నారు. వారి నాయకత్వంలో దేశం సాంస్కృతిక పునర్జాగరణ దిశగా పోతోందని, హిందూ సంస్కృతి పరిరక్షణకు వారు కృషి చేస్తున్నారని అన్నారు. దీని ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయని, సనాతన ధర్మాన్ని అనుసరించేవారు తమ సంస్కృతిపై అవగాహన పెంచుకుంటున్నారని అన్నారు.