ప్రయాగరాజ్‌లో గంగానది ఒడ్డున రివర్ ఫ్రంట్ ... దీని ప్రత్యేకత ఏంటంటే..

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భక్తుల సౌకర్యం కోసం గంగానది ఒడ్డున రివర్ ఫ్రంట్ నిర్మాణం జోరుగా సాగుతోంది. నవంబర్ 15 నాటికి ఈ రివర్ ఫ్రంట్ సిద్ధం కానుంది, దీనివల్ల రద్దీ తగ్గి, ప్రయాణం సులభతరం అవుతుంది.

Prayagraj Kumbh 2025 Riverfront Project to Ease Traffic and Enhance Visitor Experience AKP

ప్రయాగరాజ్‌ మహా కుంభమేళాను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు యోగి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా కుంభమేళాకు విచ్చేసే భక్తులు, పర్యాటకులు, సాధుసంతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టింది. ఇందులొ భాగంగానే గంగానది ఒడ్డున రివర్ ఫ్రంట్ నిర్మాణం చేపట్టారు...ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 15 నాటికి ఇది ప్రయాణానికి అందుబాటులోకి వస్తుంది.

రద్దీ సమస్యకు పరిష్కారం

ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్లకు పైగా భక్తులు, పర్యాటకులు తరలివస్తారని అంచనా. వీరి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి నగరంలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లను విస్తరిస్తున్నారు. ఇక గంగానది ఒడ్డున ప్రయాణానికి మరో మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు... ఇదే రివర్ ఫ్రంట్. దీని నిర్మాణం వల్ల భక్తులకు ఎంతో ఉపయోగం కలుగుతుంది.

ముంబై మెరీనా డ్రైవ్ తరహాలోనే ప్రయాగరాజ్‌లోనూ గంగానది ఒడ్డున దాదాపు 15.25 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తున్నట్లు కుంభమేళా అధికారి వివేక్ చతుర్వేది తెలిపారు. 213 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం జరుగుతోందని... ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. నవంబర్ 15లోపు ఇది పూర్తి కానుందని వెల్లడించారు..

కుంభమేళా ప్రాంతంలో రద్దీని నియంత్రించడంలో రివర్ ఫ్రంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటిపారుదల శాఖ, ఇతర అనుబంధ శాఖల సహకారంతో దీని నిర్మాణం జరుగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం గంగానదికి ఇరువైపులా నిర్మిస్తున్న ఈ రివర్ ఫ్రంట్ సాధారణ రోడ్ల నిర్మాణం కంటే భిన్నంగా ఉంటుందని నీటిపారుదల శాఖ సీనియర్ ఇంజనీర్ రమేష్ కుమార్ సింగ్ చెప్పారు. ఇంటర్‌లాకింగ్, బౌల్డర్ క్రేట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు, స్లోప్ పిచ్చింగ్ కూడా ఉంటుంది. ఈ రోడ్డును ఆదర్శ రోడ్డుగా అభివృద్ధి చేస్తారు. రోడ్డు పక్కన బెంచీలు ఏర్పాటు చేస్తారు. పలు చోట్ల సెల్ఫీ పాయింట్లు కూడా నిర్మిస్తారు.

ఈ ప్రాంతాల్లో రివర్ ఫ్రంట్ నిర్మాణం

గంగానది ఒడ్డున నిర్మిస్తున్న ఈ రివర్ ఫ్రంట్ పలు ప్రాంతాలను అనుసంధానం చేస్తోంది. రసూలాబాద్ ఘాట్ నుంచి నాగ్‌వాసుకి ఆలయం వరకు, సూర్‌దాస్ నుంచి ఛత్నాగ్ వరకు, కర్జన్ బ్రిడ్జి సమీపంలోని మహావీర్ పూరి వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రివర్ ఫ్రంట్ నిర్మాణం పూర్తయితే సంగమానికి చేరుకోవడానికి దూరం తగ్గుతుంది. పర్యాటకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రయాగరాజ్‌కు వచ్చే భక్తులు ఎక్కువగా సంగమానికి వెళతారు. రివర్ ఫ్రంట్ నిర్మాణం పూర్తయితే సంగమంతో పాటు ప్రయాగరాజ్‌లోని ప్రతి ప్రాంతాన్ని చూసే అవకాశం ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios