కుంభమేళా కోసం సిద్దమవుతున్న ప్రయాగరాజ్ : ఏ పనులు ఎప్పుడు పూర్తవుతాయంటే...

2025 మహాకుంభ్ కోసం ప్రయాగరాజ్‌లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. రోడ్ల విస్తరణ, హనుమాన్ ఆలయ కారిడార్ వంటి ప్రాజెక్టులతో పాటు అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 

Prayagraj Gears Up for Mahakumbh 2025 with Infrastructure Development AKP

ప్రయాగరాజ్ : 2025 మహా కుంభమేళా కోసం ప్రయాగరాజ్‌లో రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రయాగరాజ్ అభివృద్ధి ప్రాధికార సంస్థ (PDA) ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు, పర్యాటకులకు ప్రయాణం సులభతరం చేయడానికి నగరంలోని ప్రధాన రోడ్లను కొత్తగా వేయడం, ఉన్నవాటిని మరమ్మతులు చేయడం వంటి పనులు నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రయాగరాజ్ కుంభమేళా అందరికీ గుర్తుండిపోయేలా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది యోగి సర్కార్. ఈ కుంభమేళా కోసం పిడిఏ మొత్తం 50 ప్రాజెక్టులపై పనిచేస్తోంది. వీటిలో 4 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. కుంభమేళా ప్రారంభానికి ఇంకా 70 రోజులకు పైగా సమయం ఉండటంతో నవంబర్ 15 నాటికి 31 ప్రాజెక్టులను పూర్తి చేసి, నగర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

 మిగిలిన 15 ప్రాజెక్టులను నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. వీటిలో రోడ్ల విస్తరణ, మురుగునీటి వ్యవస్థ, లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాల బలోపేతం వంటివి ఉన్నాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.

హనుమాన్ ఆలయ కారిడార్ డిసెంబర్ 10 నాటికి పూర్తి

మహా కుంభమేళాలో ప్రధాన ఆకర్షణగా నిలిచే హనుమాన్ ఆలయ కారిడార్ పనులు డిసెంబర్ 10, 2024 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కారిడార్ మతపరంగానే కాకుండా పర్యాటక ప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందుతుంది. ఈ పనులు సకాలంలో పూర్తయితే ఆలయ ప్రాంతంలో జనసమ్మర్థాన్ని నియంత్రించడం, సులభంగా దర్శించుకోవడం సాధ్యమవుతుంది.

 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇటీవల మహా కుంభమేళా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రయాగరాజ్ అభివృద్ధి ప్రాధికార సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి, పనులు సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

కుంభమేళాలో కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి రోడ్ల విస్తరణ, బలోపేతంతో పాటు అందంగా తీర్చిదిద్దే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రయాగరాజ్ అభివృద్ధి ప్రాధికార సంస్థ అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి, భక్తులు, పర్యాటకులకు మరపురాని అనుభూతిని కల్పించడానికి కృషి చేస్తున్నామని పిడిఎ కార్యదర్శి అజిత్ కుమార్ సింగ్ తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios