సారాంశం

ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ వ్యవస్థాపక చైర్మన్ గా ఉన్న శశిథరూర్ ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆ పదవిని  డేటా అనలిటిక్స్ విభాగానికి చైర్మన్ గా ఉన్న ప్రవీణ్ చక్రవర్తి చేపట్టారు.

ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ గా ఆ పార్టీ  డేటా అనలిటిక్స్ విభాగానికి చైర్మన్ గా ఉన్న ప్రవీణ్ చక్రవర్తి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలను ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ నిర్వర్తించారు. ఈ విభాగానికి ఆయనే వ్యవస్థాపక చైర్మన్ గా ఉన్నారు. ఆయన స్థానంలో ప్రవీన్ చక్రవర్తిని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.

అస్సాం రైఫిల్స్ వాహనంపై ఉగ్రవాదుల దాడి.. భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలో ఘటన

ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. శశిథరూర్ చాలా కాలంగా పార్టీ ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ కు నేతృత్వం వహిస్తున్నారు. అప్పటి నుండి పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆయన రెగ్యులర్ సభ్యుడిగా మారారు.

ఇదిలా ఉండగా.. ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన చక్రవర్తి.. ఆ వింగ్ కు శశిథరూర్ చేసిన కృషిని కొనియాడారు. ‘‘శశి థరూర్ లేకపోతే ఈ వింగ్ ఇంత బాగా కొనసాగడం అసాధ్యం అని నాకు బాగా తెలుసు. శశి నేతృత్వంలోని ఏఐపీసీ నిపుణులను ఒక అధికారిక సమూహంగా సంఘటితం చేయడంలో అద్భుతంగా పని చేసింది. ఇప్పుడు దాన్ని బలీయమైన గ్రూపుగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని చక్రవర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.