Asianet News TeluguAsianet News Telugu

తెర‌వెనుక‌గా బీజేపీకి ప‌నిచేస్తున్న ప్ర‌శాంత్ కిషోర్: జేడీ(యూ)

Bihar: ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌, రాజ‌కీయ నాయ‌కుడు ప్ర‌శాంతి కిషోర్.. బీజేపీ కోసం ప‌నిచేస్తున్నార‌ని జేడీ(యూ) తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. అలాగే, ఆయ‌న చేప‌ట్టిన బీహార్ రాష్ట్రవ్యాప్త యాత్ర‌కు డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌ని ఆ పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. 
 

Prashant Kishor working behind the scenes for BJP: JD(U)
Author
First Published Oct 4, 2022, 11:01 AM IST

Prashant Kishor vs JD(U): బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జేడీ(యూ) మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌ఫున ప‌నిచేస్తున్నార‌ని ఆ పార్టీ ఆరోపించింది.అలాగే, ఆయ‌న చేప‌ట్టిన బీహార్ రాష్ట్రవ్యాప్త యాత్ర‌కు డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌ని ఆ పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. జేడీ(యూ) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ కూడా కిషోర్ రాష్ట్రవ్యాప్త పాద యాత్రపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. నితీష్ కుమార్ సుపరిపాలన గురించి ఒక దశాబ్దం పాటు బీహార్ వెనుకబడి ఉందని చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. నితీష్‌ కుమార్‌ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో బీహార్‌ ప్రజలకు తెలుసున‌ని ఆయ‌న పేర్కొన్నారు.  ప్రశాంత్ కిషోర్ నుండి మాకు సర్టిఫికేట్  తీసుకోవాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇతర పౌరుల మాదిరిగానే అతను మార్చ్ లేదా ప్రదర్శన చేయడానికి స్వేచ్ఛగానే ఉన్నాడ‌ని అన్నారు. 

"ప్ర‌శాంత్ కిషోర్ తన బీహార్ ప్రచారానికి ఏ పేరును ఎంచుకుంటాడో కానీ, అయ‌న మాత్రం బీజేపీ తరపున పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని విమ‌ర్శించారు. పబ్లిసిటీ కోసం ఆయన చెల్లిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. “మంచిగా స్థిరపడిన రాజకీయ పార్టీలు కూడా పూర్తి పేజీ ప్రకటనలు ఇవ్వడం మనం ఎన్నిసార్లు చూస్తాము? నిన్న పాద యాత్ర కోసం ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లు చూస్తూ అనుమానంతో పాటు ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఐటీ (ఆదాయ పన్ను) శాఖ, సీబీఐ లేదా ఈడీ ఎందుకు పట్టించుకోవడం లేదు? అతను కేంద్రాన్ని పాలించే వారి మద్దతును అనుభవిస్తున్నాడని మాత్రమే సాధ్యమైన వివరణ” అని లాలన్ ఆరోపించారు. అన్ని రకాల రాజకీయ నాయకులతో పనిచేసిన ఒక సమస్యాత్మక వ్యక్తి, బీహార్‌లోని బక్సర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ప్రొఫెషనల్ పొలిటికల్ కన్సల్టెన్సీని విడిచిపెట్టి, సామూహిక సమీకరణ ద్వారా తన సొంత రాష్ట్రాన్ని మార్చడానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నట్లు ప్ర‌క‌టించారు. 

అంత‌కుముందు నీతిష్ కుమార్, ప్ర‌శాంత్ కిషోర్ పై బీజేపీ చేసిన వ్యాఖ్య‌ల అనంత‌రం జేడీ(యూ) నాయ‌కుడు పై వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.  "నితీష్ కుమార్‌తో నిగూఢ అవగాహన కలిగి ఉన్న కిషోర్‌ను రాజకీయ మధ్యవర్తి" అని పేర్కొంటూ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్  ఆరోపించారు.  కాగా, 2014 లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ స‌ర్కారును అధికారంలోకి తీసుకురావ‌డానికి ప్ర‌శాంత్ కిషోర్ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేశారు. తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగింది. అలాగే, ఒక సంవత్సరం తర్వా, ఆయ‌న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో JD(U), బీజేపీ కూట‌మి అధికారంలోకి రావ‌డానికి కృషి చేయ‌డంలో విజ‌యం సాధించారు. అయితే, ఇటీవ‌ల బీజేపీతో దోస్తాన్ క‌ట్ చేసుకున్న నితీష్ కుమార్..కాంగ్రెస్, ఆర్జేడీ స‌హా ఇత‌ర పార్టీల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా, కచ్చితమైన వ్యూహంతో దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బహిరంగంగానే క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios