దేశంలోని త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోని 80 శాతం ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేస్తే ఇబ్బంది ఉండదని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: దేశంలో omicron వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో త్వరలో ఐదు రాష్ట్రాల Asembly Elections ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లోని 80 శాతం ప్రజలకు రెండు డోసుల Corona వ్యాక్సిన్ వేయిస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఎన్నికల వ్యూహాకర్త Prashant Kishor చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయ్యే వరకు Election Commission చర్యలు తీసకొంటే ఎన్నికల నిర్వహణకు అంతగా ఇబ్బందులుండవని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాదిలో ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఆయా రాష్ట్రాల్లో కరోనా Vaccination పరిస్థితిని కేంద్రం నిన్న ప్రకటించింది.
కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం నాడు ఈ ఐదు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశం మేరకు ఈ ఐదు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఈసీ సమీక్షించింది.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాజకీయ పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలను రద్దు చేసుకొంటున్నాయి. ఎన్నికల ర్యాలీలపై ఈసీ మాత్రం ఇంకా నిషేధం విధించలేదు.
డెల్టాతో పోలిస్తే కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న వారిలో ఒమిక్రాన్ తక్కువ తీవ్రతతో ఉందని కూడా డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది. ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ తరహలోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. డెట్టా వేరియంట్ వల్ల రోగులు ఎక్కువగా ఐసీయూల్లో చేరితే ఒమిక్రాన్ తో ఆసుపత్రుల్లోని సాధారణ వార్డులు నిండిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఇండియాలో కూడా కరోనా కేసులు భారీగా పెరిగాయి.గత 24 గంటల్లో కరోనా కేసులు 1,17, 100 నమోదయ్యాయి.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కరోనా కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా పరిస్తితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈఃసీఐతో గురువారం నాడు సమావేశమయ్యారు.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ప్రధానంగా యూపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికలపైనే అన్ని పార్టీల దృష్టి నెలకొంది.యూపీలో అధికారాన్ని నిలుపుకోవడం బీజేపీకి కీలకం. అయితే పలు సంస్థల సర్వేల్లో బీజేపీకి సానుకూలంగా ఉందని తేల్చి చెప్పాయి. అయితే సమాజ్‌వాదీ పార్టీ కూడా బీజేపీకి సమీపంగా ఉంది. అయితే ఇతర పార్టీలతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు లు పెట్టుకొంటుంది.
