బెంగాల్ లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే పార్టీలను అధికారంలోకి తీసుకురవడంలో ప్రధాన పాత్ర పోషించిన రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ తాను ఇక మీద ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించబోనని, ఈ 8 సంవత్సరాల్లో తాను చూడవల్సినదానికంటే ఎక్కువ చూశానని ఇక మీద ఈ రంగంలో ఉండబోనని తేల్చి చెప్పారు. 

కొన్ని నెలలుగా తన కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నానని, ఇక మీదట ఈ రంగంలో కొనగబోనని తేల్చి చెప్పారు. మంచి చేదు అంతా చూశానని ఇక చాలని అన్నాడు. ఎన్నికల్లో మమతా ఓడిన తరువాత ప్రశాంత్ కిషోర్ కి ఉద్యోగం ఉండబోదని అంతా వెక్కిరించారని, ఇప్పుడు గెల్చిన తరువాత చెబుతున్ననై, తాను ఇక మీదట ఈ రంగం నుండి తప్పుకోనున్నట్టు తెగేసి చెప్పారు. 

తన ఐపాక్ టీం ని ప్రస్తుతం అందులో నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారు చూసుకుంటారని, తాను ఈ గజిబిజి బిజీ లైఫ్ నుంచి దూరంగా తన కుటుంబంతో గడపాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు. రాజకీయాల్లోకి వస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రం నవ్వుతు సమాధానాన్ని దాటవేశారు. 

తాను ఒక ఫెయిల్ అయిన రాజకీయ నాయకుడిని అని అన్నాడే తప్ప తాను రాజకీయాల్లోకి రానని మాత్రం అనలేదు. ఎన్నికల్లో పది తాను తన పర్సనల్ లైఫ్ ని బాగా కోల్పోయానని, ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకుంది కాదని, తన టీం లో కూడా కొద్దిమందికి ఇప్పటికే ఇది తెలుసని అన్నాడు. 

ఆయన ఎన్నికలకు ముందు బీజేపీ 100 సీట్లకు చేరుకోలేదు అని సవాల్ విసిరాడు. అన్నట్టుగానే బీజేపీ 100 లోపే చాప చుట్టేసేలా కనబడుతుంది. గతంలో అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, అప్ సీఎం జగన్ మోహన్ రెడ్డి, 2014లో మోడీలకు వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ మరోసారి తానేమిటో నిరూపించుకున్నాడు. అటు తమిళనాడులో కూడా స్టాలిన్ ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేయడంలో సఫలీకృతుడయ్యాడు.