Asianet News TeluguAsianet News Telugu

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు

Prashant Kishor: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం నాడు కీలక ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ బీజేపీని మరో విజయపథంలో నడిపించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని చెప్పారంటే?  

Prashant Kishor predicts how many seats BJP will win in Lok Sabha election 2024 KRJ
Author
First Published May 21, 2024, 5:24 PM IST

Prashant Kishor: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం నాడు కీలక ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ బీజేపీని మరో విజయపథంలో నడిపించగలరని మీడియా ఛానెల్ NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ అన్నారు. జన్‌ సూరజ్‌ పార్టీ చీఫ్‌ ప్రశాంత్ కిషోర్  అంచనా వేస్తూ.. బీజేపీ పార్టీ సీట్ల సంఖ్య 2019లో 303 సీట్లకు చేరువలో లేదా అంతకంటే ఎక్కువ సీట్లు రావొచ్చని తెలిపారు.  

'బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది'

ఎన్‌డిటివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  ప్రశాంత్ కిషోర్‌ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు గురించి మాట్లాడుతూ.. 'మోదీ నేతృత్వంలోని బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందని నేను భావిస్తున్నాను. గత ఎన్నికల మాదిరిగానే వారికి సమాన సంఖ్యలో సీట్లు రావచ్చు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు రావచ్చు. తప్పకుండా బీజేపీ మాత్రం అధికారంలోని వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వంపైనా, నాయకుడిపైనా విశ్వసం ఉందని, అతడే అధికారంలో ఉంటే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. 'మోదీ జీపై ప్రజల్లో ఆగ్రహం ఉందని ఇప్పటి వరకు నేను వినలేదు. కాస్త నిరాశ ఉండవచ్చు, ఆకాంక్షలు నెరవేర వేస్తారనే నమ్మకం ఉంది.కానీ ఎవరిలోనైనా ప్రధాని మోడీపై కోపం ఉన్నవారిని చూడలేదు. అని అన్నారు. బీజేపీ లక్ష్యం 370 సీట్లు, ఎన్డీయే లక్ష్యం 400 సీట్లపై ప్రశాంత్ కిషోర్‌ బదులిస్తూ.. బీజేపీ చెప్పినట్లుగా 370 స్థానాలు మాత్రం రావని, కానీ, బీజేపినే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని అన్నారు. ఇలా 370, 400 వస్తాయని చెప్పడం..ఆ పార్టీకి లాభమేనని, అదే రాజకీయాలను, ప్రజలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యాలు  తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios