Prashant Kishor Meets Sonia Gandhi: హస్తిన రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం సాయంత్రం సోనియా గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో  పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ కూడా సోనియా గాంధీని కలిశారు. సోనియాతో ప్రశాంత్ కిశోర్, మెహబూబా ముఫ్తీ భేటీ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం సోనియా గాంధీని కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Prashant Kishor Meets Sonia Gandhi: దేశ రాజ‌కీయాల్లో రోజురోజుకు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2024 ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని గ‌ద్దేదించాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఓ వైపు థ‌ర్డ్ ప్రంట్ ఏర్పాటు కు స‌న్నాహాకాలు ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తోంది. తాజాగా.. బీజేపేతర ముఖ్య‌మంత్రులు దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో భేటీ కాబోతున్న‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. 

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ మాత్రం 2024 ఎన్నికల్లో సత్తా చాటాల‌ని భారీ ఎత్తున‌ వ్యూహార‌చ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ‌రుస‌గా భేటీ అవుతు హ‌ట్ టాఫిక్ గా మారింది. తాజాగా సోమవారం సాయంత్రం సోనియా గాంధీతో ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ కూడా సోమవారం సోనియా గాంధీని కలిశారు. సోనియాతో ప్రశాంత్ కిశోర్, మెహబూబా ముఫ్తీ భేటీ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం సోనియా గాంధీని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమ‌ మారింది. 

కాశ్మీర్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసేందుకు మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ మరోసారి కలిసి పని చేయడం ప్రారంభించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ ని టార్గెట్ చేసిన‌ట్టు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తద్వారా వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి భారతీయ జనతా పార్టీతో పోటీ పడవచ్చు.

తాజా సమావేశంలో.. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జ‌రుగ‌నున్న‌ కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఎన్నికలకు ప్రణాళిక‌లు రచిస్తున్నట్టు స‌మాచారం. ఈ సమావేశానికి ఆమె కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కెసి వేణుగోపాల్, అంబికా సోని హాజరైనట్టు స‌మాచారం. 

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 370 స్థానాల్లో పోటీ చేయాలనే ప్రణాళికతో పాటు కొన్ని రాష్ట్రాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రణాళిక‌ల గురించి చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో కాంగ్రెస్ ఒంటరిగా పోరాడాలని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మరియు మహారాష్ట్రలో పొత్తులు పెట్టుకోవాలని కిషోర్ సూచించారని, దీనికి రాహుల్ గాంధీ అంగీకరించారని స‌మాచారం.

రాష్ట్ర ఎన్నికలలో శక్తివంతమైన ప్రాంతీయ నాయకులు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావుల సహాకారం తీసుకోవాల‌ని సూచించిన‌ట్టు టాక్. ఇప్ప‌టికే.. ప్ర‌శాంత్ కిషోర్ సంస్థ IPAC సంస్థ బెంగాల్, ఏపీలో ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. ఈ రాష్ట్రాల్లో బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించిన విష‌యం తెలిందే..

అయితే.. గత ఏడాది, బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో చేరాలనే మిస్టర్ కిషోర్ ప్లాన్ విఫలమైంది. ప్రముఖంగా, ప్రశాంత్ కిషోర్ రెండు వారాలలో సోనియా, రాహుల్ గాంధీలను పలుమార్లు కలిశారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని పోవాలని, బీజేపీకి ఎలాగైనా చెక్ పెట్టాలని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నేతలకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.