Asianet News TeluguAsianet News Telugu

సుప్రీం చీఫ్ జస్టిస్ పై కామెంట్స్.. ధోషిగా తేలిన ప్రశాంత్ భూషణ్

వ్యక్తిగత స్వేచ్ఛను వినియోగించుకుని, కోర్టు పనితీరు గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను తప్పా కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడలేదని ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు

Prashant Bhushan Guilty Of Contempt For Tweets On Chief Justice, Judiciary
Author
Hyderabad, First Published Aug 14, 2020, 1:02 PM IST

సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ని సుప్రీం కోర్టు దోషిగా తేల్చింది. ప్రశాంత్ భూషణ్ గతంలో.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారీల ధర్మాసనం ఈ మేరకు ఆయనను ధోషిగా నిర్థారించింది. 

ఈ కేసు విచారణ శుక్రవారం పూర్తి చేసిన సుప్రీం కోర్టు.. తీర్పు ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది. ఆయన రోజు ప్రశాంత్ భూషణ్ కి శిక్ష ఖరారు చేయనున్నారు. అయితే, వ్యక్తిగత స్వేచ్ఛను వినియోగించుకుని, కోర్టు పనితీరు గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను తప్పా కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడలేదని ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు. ఆగస్టు 3న దాఖలుచేసిన అఫిడవిట్‌లో తాను ట్వీట్ చేసిన వాటిలో కొంత భాగాన్ని మాత్రమే చింతిస్తున్నానని, ఉన్నతాధికారిపై విమర్శలు న్యాయస్థానం ప్రతిష్ఠకు భంగం కలిగించవని, దాని అధికారాన్ని తగ్గించవని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.

ప్రశాంత్ భూషణ్‌ 2009లోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సంచలన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టులోని 16 మంది న్యాయమూర్తులు అవినీతిపరులేనంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. ఈ కేసులో ప్రశాంత్‌ భూషణ్‌ వివరణ, క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతేకాక ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయా లేదా అన్నది పరిశీలించనున్నట్లు తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios