గోవా: గోవా ముఖ్యమంత్రిగా శాసనసభ స్పీకర్ ప్రమోద్ సావంత్ ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. గోవా సీఎంగా ఉన్న మనోహర్ పారికర్ మృతి చెందండంతో సీఎం పదవి ఖాళీ అయ్యింది. దీంతో బీజేపీ అధిష్టానం ప్రమోద్ సావంత్ ను సీఎంగా ఎంపిక చేసింది. 

సోమవారం ఆయన పదవీబాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సీఎం ఎంపిక కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, గోవా బీజేపీ ఎమ్మెల్యేలతో పనాజిలో సమావేశమయ్యారు. 

సమావేశంలో ప్రమోద్ సావంత్ ను ఎంపిక చేశారు. మరోవైపు రాష్ట్రంలో పెద్ద పార్టీగా ఉన్న తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆ రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. ప్రస్తుతం బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిత్రపక్షాలతో కలిపి ఆ సంఖ్య 20కి పెరిగింది. 14మంది శాసన సభ్యులతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ అతిపెద్దపార్టీగా కొనసాగుతోంది. సావంత్ ప్రస్తుతం గోవా శాసన సభ స్పీకర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.