బెంగళూరు: ఎన్డీయే ప్రభుత్వంపై సినీనటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇప్పటికే మోదీ సర్కార్‌పై అనేకసార్లు తనదైన శైలిలో విరుచుకుపడ్డ ప్రకాష్ రాజ్ మరోసారి తన గళాన్ని విప్పారు. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్ రాజీనామా నేపథ్యంలో ట్విట్టర్‌లో స్పందించారు.  

ఆర్బీఐ చీఫ్ రిజైన్ చేశారు. సీబీఐ చీఫ్‌ను సెలవులపై పంపించారు. నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. ఈ విధ్వంసకర ప్రభుత్వాన్ని మౌన ప్రేక్షకుల్లా ఇంకెన్నాళ్లు భరిస్తాం’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ‘జస్ట్ ఆస్కింగ్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు ప్రకాశ్ రాజ్. 

కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా ఎండగడుతున్నారు. నేతలపై ప్రశ్నలు సంధిస్తున్నారు.