KCR-Prakash Raj: బీజేపేతర  పార్టీల‌ కూట‌మి ఏర్పాటు లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా.. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్ర‌త్యేక్షం కావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రుస్తుంది. కేసీఆర్, ఉద్ధవ్‌ ఠాక్రే భేటీలో ప్ర‌కాశ్ రాజ్ సెంట‌ర్ ఆఫ్ ఆట్రాక్ష‌న్ మారాడు.   

KCR-Prakash Raj:బీజేపీయేతర పార్టీల‌ను ఏకతాటిపైకి తీసుక‌రావ‌డానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటించిన విష‌యం తెలిసిందే.. ఈ పర్య‌ట‌న‌లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేతో సుధీర్ఘంగా చ‌ర్చ నిర్వ‌హించారు. ప‌లు విష‌యాల్లో ఏకాభిప్రాయానికి వ‌చ్చామ‌నీ, మరో సారి బీజేపేత‌ర పార్టీల‌న్నీ భేటీ అయి, భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేస్తామని తెలిపారు. 

అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా.. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్ర‌త్యేక్షం కావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రుస్తుంది. కేసీఆర్, ఉద్ధవ్‌ ఠాక్రే భేటీలో ప్ర‌కాశ్ రాజ్ సెంట‌ర్ ఆఫ్ ఆట్రాక్ష‌న్ మారాడు. ఈ భేటీలో ప్ర‌కాశ్ రాజ్ ను సీఎం కేసీఆరే ఇత‌రుల‌కు ప‌రిచ‌యం చేసిన‌ట్టు టాక్.

ప‌లు భాషల్లో నటించి, మెప్పించిన నటుడు ప్రకాశ్ రాజ్.. రాజకీయ ప‌రంగా ప్రధాని మోదీ యొక్క‌ విధాన పరమైన అనేక‌ నిర్ణయాలను విభేధించారు. ప‌లు మార్లు ఓపెన్ డిబెట్లో బీజేపీ వైఖ‌రిని క‌డిగి పారేశారు. ఈ కార‌ణంతోనే సీఎం కేసీఆర్ తన టీంలో ప్రకాశ్ రాజ్ కు చోటు కల్పించిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌కాశ్ రాజ్.. 2019 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. అలాగే.. ఇటీవ‌ల జరిగిన తెలుగు సినీ పరిశ్రమలోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేసి.. ఓటమి పాలైన విష‌యం తెలిసిందే. సోష‌లిస్ట్ భావాలున్న ప్ర‌కాశ్ రాజ్ మోడీ విధానాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్ తో కూడా త‌రుచు కంటాక్ట్ లో ఉంటున్న‌ట్టు టాక్.

అందుకే.. సడెన్ గా సీఎం కేసీఆర్ త‌న ముంబై టూర్ లో ప్రకాష్‌రాజ్‌‌కు చోటు కల్పించిన‌ట్టు తెలుస్తోంది. కొంత కాలం క్రితం మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ భేటీకి కేసీఆర్, ప్రకాష్‌రాజ్‌ను కూడా తీసుకెళ్లారు. సీఎం ఉద్దవ్ థాక్రేతో స‌మావేశం పూర్తయిన తరువాత కేసీఆర్ తన కారులోనే ప్రకాశ్ రాజ్ తో కలిసి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో కేంద్రం పైన పోరాటంలో ప్రకాశ్ రాజ్ కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. 


ప్రకాశ్ రాజ్ కు కీలక బాధ్యతలు 

జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య జరిగినప్పటి నుంచి ప్రధాని మోదీపై, బీజేపీ విధి విధానాల‌పై ప్రకాశ్ రాజ్ విమర్శ‌లు చేస్తుంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా, బీజేపీ ప్రభుత్వంపైనా రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంద‌ర్భాలు అనేకం. అందుకే ప్రకాష్ రాజ్‌ను మోడీ నేతృత్వంలోని బీజేపీ పైన తాను చేస్తున్న పోరాటంలో భాగస్వామిని చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు పలువురు అభిప్రాయ ప‌డుతున్నారు. 

అలాగే.. కర్నాటక, తమిళనాడు రాజకీయ నాయ‌కుల‌తో ప్రకాష్ రాజ్ మంచి సంబంధాలున్నాయి. జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా బలీయమైన రాజకీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలనే ఆశయం ఉన్న సీఎం కేసీఆర్.తన బృందంలో.. త‌న ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టు ఉన్న ప్రకాశ్ రాజ్ కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌నే చ‌ర్చ అప్పుడే మొద‌లైంది. 

ఇదిలా ఉంటే.. సిఎం కెసిఆర్ త్వరలో ఎంకె స్టాలిన్, హెచ్‌డి దేవెగౌడలను కలవబోతున్నారు. ఈ భేటీలోనూ ప్రకాష్‌రాజ్ కీలకం కానున్నారని ప‌లువురు భావిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా 2018 ఏప్రిల్‌లో దేవెగౌడను కలవడానికి వెళ్లిన స‌మ‌యంలో ప్ర‌కాశ్ రాజ్ ను కూడా కేసీఆర్ త‌న వెంట తీసుక‌వెళ్లిన విష‌యం తెలిసిందే. 

అలాగే సీఎం ముంబాయి టూర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఉండటం మరో ఆశ్చర్యం. కవిత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే మంచి స్నేహితులని సంబంధిత వర్గాలు తెలిపాయి. 20014 నుంచి 2019 వరకు కవిత నిజామాబాద్ ఎంపీగా పనిచేసినప్పుడు వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని అంటున్నారు. సుప్రియ మూడు పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు.

ఏది ఏమైనా కేసీఆర్ ఏర్పాటు చేయబోయే బీజేపేత‌ర కూటమిలో ప్రకాష్‌రాజ్ కీలకంగా మారనున్నారనేదనే .. ముంబాయి పర్యటనలో స్పష్టమైంది. దీంతో..ఇప్పుడు ప్రకాశ్ రాజ్ టాఫిక్ అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.