తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశం మొత్తం చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ స్పందించారు. సనాతన ధర్మం అంటరానితనం సమానం అని అభివర్ణించారు.

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై హిందూ సంస్థల ప్రతినిధులు, పలు రాజకీయల నాయకులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన్ ఆఘాడీ జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ స్పందించారు. సనాతన ధర్మాన్ని 'అంటరానితనం'తో సమానమని సోమవారం పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన తన ఎక్స్ హ్యాండిల్ (ట్విట్టర్) లో ‘‘సనాతన ధర్మం = అంటరానితనం’’ అని రాసి ఇంగ్లీష్ లో రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. అలాగే మరో పోస్టులో ప్రకాశ్ అంబేడ్కర్ మరో పోస్టులో సనాతన ధర్మంపై ప్రశ్నలు సంధించారు. ‘‘సనాతన ధర్మం అంటరానితనాన్ని నమ్ముతుంది. సనాతన ధర్మాన్ని ఎలా అంగీకరిస్తాం?’’ అని ప్రశ్నించారు.

Scroll to load tweet…

సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం రేగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వైరస్ వంటి వ్యాధులతో పోల్చిన స్టాలిన్.. దాన్ని వ్యతిరేకించలేమని, నిర్మూలించాలని కోరారు. సనాతను వ్యతిరేకించే బదులు దాన్ని నిర్మూలించాలని, సనాతన అనే పేరు సంస్కృతం నుంచి వచ్చిందని ఆయన అన్నారు. ఇది సామాజిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకమని చెప్పారు.

కాగా.,. ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్ (ఇండియా) క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం డిమాండ్ చేసింది. జైసల్మేర్ లోని రాందేవ్రా నుంచి 'పరివర్తన సంకల్ప్ యాత్ర'లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే సనాతన ధర్మాన్ని అవమానిస్తోందని ఆరోపించారు. ‘‘సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని అంటున్నారు. దీనిపై 'బీజేపీ' కూటమి మిత్రపక్షాలు మౌనం వహించాయి. గెహ్లాట్ ఎందుకు మౌనంగా ఉన్నారు, సోనియా ఎందుకు మౌనంగా ఉన్నారు? కాంగ్రెస్, భారత్ క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా డీఎంకే, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షంపై చర్యలు తీసుకోవడానికి బదులుగా, ఆ పార్టీ భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగు వెనుక ఆశ్రయం పొందుతోంది’’ అని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీకి చెందిన ఇతర సీనియర్ నాయకులు ఉదయాంధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.