Fuel Price Surge: దేశంలో చ‌మురు ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో వాహ‌న‌దారుల‌తో పాటు సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై స్పందించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఇది ప్ర‌ధాని మంత్రి జ‌న్ ధ‌న్ లూట్ యోజ‌న అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.  

Rahul Gandhi: దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా రికార్డు స్థాయిలో ప్ర‌స్తుతం ఇంధ‌న ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. దేశంలో చ‌మురు ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో వాహ‌న‌దారుల‌తో పాటు సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై స్పందించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఇది ప్ర‌ధాని మంత్రి జ‌న్ ధ‌న్ లూట్ యోజ‌న అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. నిత్యావసర వస్తువుల ధరల రోజువారీ పెరుగుదల సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మ‌రీ ముఖ్యంగా వంట‌కు ఉప‌యోగించే నిత్యావ‌స‌రాల‌తో పాటు పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ ధరల గ‌రిష్టంగా పెరుగుతుండ‌టం ప్ర‌జ‌ల‌పై తీవ్ర‌మైన ఆర్థిక భారాన్ని మోపుతోంది. ప్ర‌స్తుత ధ‌ర‌ల పెరుగుద‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ స‌ర్కారుపై ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నాయి. ధ‌ర‌ల త‌గ్గింపున‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చ‌మురు ధ‌ర‌లు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై స్పందిస్తూ.. కేంద్రలోని మోడీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది మోడీ స‌ర్కారు "ప్రధాన మంత్రి జన్ ధన్ లూట్ యోజన" అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు.

రాహుల్ గాంధీ త‌న ట్విట్టర్‌లో కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు కాక‌ముందు.. ఏర్పాటు త‌ర్వాత పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. ట్వీట్ చేశారు. అలాగే, పెట్రోల్‌, డీజిల్ ను వివిధ వాహ‌నాల్లో ట్యాంక్ ఫుల్ చేయిస్తే.. కాంగ్రెస్ పాల‌నంలో ఉన్న ధ‌ర‌లు.. ప్ర‌స్తుత బీజేపీ హ‌యంలో ఉన్న ధ‌ర‌ల‌ను పొల్చుతూ ఉన్న ఓ చిత్రాన్ని కూడా పంచుకున్నారు. దానికి ప్ర‌ధాని మంత్రి జ‌న్ ధ‌న్ లూట్ యోజ‌న అంటూ రాసుకొచ్చారు.

Scroll to load tweet…

కాగా, లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ఇంధన ధరల పెంపుపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సెషన్‌లో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. సోమవారం, దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు గత రెండు వారాల్లో పన్నెండవసారి పెరిగాయి. చమురు కంపెనీలు సోమవారం పెట్రోలు, డీజిల్ ధరలను లీటర్‌కు 40 పైసల చొప్పున‌ పెంచాయి. మొత్తంగా గ‌త ప‌న్నెండు రోజుల్లో ఇంధ‌నం ధ‌ర‌లు లీటరుకు రూ.8.40 పైగా పెరిగాయి. పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.81 కాగా, డీజిల్ ధర రూ.95.07గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి రూ.118.83కి చేరుకుంది. డీజిల్‌పై 43 పైసలు పెంచగా, ఇప్పుడు రూ.103.07గా ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చమురు ధరలు గమనిస్తే.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 117.53 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 103.60గా ఉంది. విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 118.55కాగా, డీజిల్‌ రూ. 105.90కి చేరింది. మార్చి 22న మొదట‌గా చ‌మురు ధ‌ర‌ల‌పు పెంపు ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత వరుసగా పన్నెండవ రోజు దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి.మొత్తం పెట్రోల్ ధరలు లీటరుకు రూ.8.40 పెరిగాయి.