లడఖ్ సమీపంలోని భారత్‌కు చెందిన విద్యుత్ సరఫరా కేంద్రాలు, పవర్ గ్రిడ్‌లను చైనా ప్రభుత్వ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ రికార్డెడ్ ఫ్యూచర్ బుధవారం ఒక నివేదికలో తెలిపింది.
లడఖ్ సమీపంలోని భారత్‌కు చెందిన విద్యుత్ సరఫరా కేంద్రాలు, పవర్ గ్రిడ్‌లను చైనా ప్రభుత్వ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ రికార్డెడ్ ఫ్యూచర్ బుధవారం ఒక నివేదికలో తెలిపింది. గత ఎనిమిది నెలలుగా చైనా హ్యాకర్లు ఇదే పనిలో ఉన్నారని వెల్లడించింది. గత కొంతకాలంగా సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య గత రెండు సంవత్సరాలుగా ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ నివేదిక వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపింది. చైనా హ్యాకర్లు కీలక సమాచారాన్ని ఏమైనా అపహరించారా..? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే ఇందుకు సంబంధించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ స్పందించారు. లడఖ్ సమీపంలోని విద్యుత్ పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి చైనా హ్యాకర్లు చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదని తెలిపారు. ‘‘ "లడఖ్ సమీపంలోని విద్యుత్ పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి చైనా హ్యాకర్లు చేసిన రెండు ప్రయత్నాలు విజయవంతం కాలేదు. ఇటువంటి సైబర్ దాడులను ఎదుర్కోవడానికి మేము ఇప్పటికే మా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసాం ’’ అని మంత్రి RK Singh చెప్పారు.
ఇక, ‘‘ఇటీవల నెలల్లో గ్రిడ్ నియంత్రణ, విద్యుత్ పంపిణీ కార్యకలాపాలను నిర్వహించే కనీసం ఏడు భారతీయ లోడ్ డెస్పాచ్ సెంటర్‌లను (SLDC) లక్ష్యంగా చేసుకున్న నెట్‌వర్క్ చొరబాట్లను మేం గమనించాం. గుర్తించిన ఎస్‌ఎల్‌డీసీలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఇవి లడఖ్‌లోని భారతదేశం-చైనా సరిహద్దు సమీపంలోని ప్రాంతాలలో గ్రిడ్, విద్యుత్ సరఫరాను నియంత్రిస్తాయి’ అని రికార్డెడ్ ఫ్యూచర్ నివేదిక తెలిపింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో ఈ దాడులు జరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
‘‘పవర్ గ్రిడ్ ఆస్తుల లక్ష్యంతో పాటు జాతీయ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ, బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన భారతీయ అనుబంధ సంస్థను కూడా టార్గెట్ చేసుకున్నట్టు గుర్తించాం’ అని తెలిపింది. నివేదికను ప్రచురించే ముందు తమ పరిశోధనల గురించి ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లుగా చెప్పింది.
‘పవర్ గ్రిడ్ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు జాతీయ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ, బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన భారతీయ అనుబంధ సంస్థ కూడా టార్గెట్ చేసుకున్నట్టు గుర్తించాం’ అని తెలిపింది. ఈ నివేదిక బహిర్గతం చేయడానికి ముందే భారత ప్రభుత్వాన్ని అప్రమత్తమం చేశామని వివరించింది. దాడికి పాల్పడిన చైనా హ్యాకర్లు క్లిష్టమైన మౌలిక సదుపాయాల వ్యవస్థల గురించి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పింది. మౌలిక సదుపాయాల సమాచారాన్ని సేకరించి.. భవిష్యత్తు వ్యూహాలకు వాడుకునే అవకాశం ఉందని పేర్కొంది.
హ్యాకింగ్ కోసం TAG-38 గ్రూప్ ShadowPad malwar వినియోగించినట్టుగా తెలిపింది. ఈ హ్యాకింగ్ గ్రూపు గతంలో చైనాతో కలిసి పనిచేసిందని రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ వెల్లడించింది.
